Komatireddy: నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనే.. కోమటిరెడ్డి సంచలన ప్రకటన

వేముల వీరేశంను నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎంపీ కోమటిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రేపటి నుంచి ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ రోజు కోమటిరెడ్డిని వీరేశం మర్యాదపూర్వంగా కలిసిన సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు కోమటిరెడ్డి.

New Update
Komatireddy: నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనే.. కోమటిరెడ్డి సంచలన ప్రకటన

ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని (Komatireddy Venkat Reddy) ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ను తాము దగ్గరుండి గెలిపించామన్నారు. గెలిచిన తర్వాత తమనే ఆయన దారుణంగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. మొదట తాము చిరుమర్తి లింగయ్యను జడ్పీటీసీ గా గెలిపిస్తే.. పెద్ద పదవి తనకు ఎందుకు అని అన్నాడని గుర్తు చేశారు కోమటిరెడ్డి. తర్వాత ఆయనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించామని చెప్పారు.

వేముల వీరేశంను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోమటిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రేపటి నుంచి ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. వీరేశం కు అన్ని రకాలుగా అండదండలు అందిస్తానని హామీ ఇచ్చారు. నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాతు తనకు రెండు కళ్ళ లాంటివన్నారు. ఇన్నాళ్లూ నకిరేకల్ లో పార్టీని బతికించిన వారిని తాను చూసుకుంటానని.. ఎవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు కోమటిరెడ్డి.

కాంగ్రెస్ పార్టీలో వీరేశం చేరికను స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. వీరేశం పార్టీలో చేరిక కార్యక్రమంలోనూ కోమటిరెడ్డి పాల్గొనలేదు. దీంతో వీరేశం విషయంలో కోమటిరెడ్డి ఎలా స్పందిస్తారన్న విషయంపై కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ వ్యక్తమైంది. తాజాగా వీరేశంను గెలిపించాలని కోమటిరెడ్డి కార్యకర్తలకు పిలునివ్వడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది. వీరేశం అభ్యర్థిత్వానికి కోమటిరెడ్డి రెడ్డి ఓకే చెప్పినట్లు స్పష్టమైంది. ఈ పరిణామంతో వీరేశం అభిమానుల్లో హర్షం వ్యక్తం అవుతుండగా.. కోమటిరెడ్డి అండతో తమకే టికెట్ దక్కుతుందని ఇన్నాళ్లుగా భావించిన నేతలు మాత్రం షాక్ కు గురయ్యారు.

Advertisment
తాజా కథనాలు