/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/yuvajana-jpg.webp)
Bharatha Chaitanya Yuvajana Party: సామాన్యుడికి అధికారం.. సామజిక సమన్యాయం దిశగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన భారత చైతన్య యువజన పార్టీ ఎన్నికల ప్రక్రియలో దూసుకెళ్తుంది.. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గత నాలుగు రోజులుగా అభ్యర్థుల ఎంపిక సహా ఇతర వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు.. ఈ క్రమంలోనే ఎన్నికల్లో అత్యంత కీలకమైన "ఎన్నికల మ్యానిఫెస్టో"ను ఆ పార్టీ విడుదల చేసింది. 18 కీలక అంశాలతో రూపొందిన ఈ మ్యానిఫెస్టోలో హైదరాబాద్ పై సంచలన హామీ ద్వారా ఈ పార్టీ తేలానగన్ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరతీసింది. "ప్రతీ మాటను అమలు చేసి నవ, యువ తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తాం.. ప్రతీ ఒక్కరి ఆశలు నెరవేర్చి, ఆదర్శనీయంగా నిలుపుతాం.." అంటూ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీసీవై పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ఇది.. ప్రతీ మాటను అమలు చేసి నవ, యువ తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తాం.. ప్రతి ఒక్కరి ఆశలు నెరవేర్చి, ఆదర్శనీయంగా నిలుపుతాం.. #BCYParty#BharathaChaitanyaYuvajanaParty#RCYBCY
#BCYRCY#RamaChandraYadavpic.twitter.com/TgAAGfIRT2— Bharatha Chaitanya Yuvajana Party (@BCYParty4People) October 30, 2023
తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు
* కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్
* దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్
* ఇంటర్మీడియట్ వరకు ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలో ఉచిత విద్య
* ప్రభుత్వ, ప్రైవేటు, కార్వొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం
* డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ భరోసా(ఉచిత వసతి, ఆహారం,నెలకు రూ.2500 )
* రాష్ట్రంలోని ప్రతీ రైతుకు ఒక ఆవు
*రాష్ట్రంలో కొత్తగా 5 విశ్వవిద్యాలయాలు
*వారంలో అయిదు రోజులు మాత్రమే బడి(శనివారం ఆటలు,మానసిక ఉల్లాస విద్య)
*దేవాదాయ శాఖను పూర్తిగా రద్దు చేసి, ప్రతీ ఆలయానికి అర్చకులతో కూడిన కమిటీల నియామకం
*విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్
*బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
*ఉద్యోగులకు వారంలో 5 రోజులే పనిదినాలు
*ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్
*ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలలో 3 రోజులు ఆప్షనల్ హాలీడేస్
Follow Us