Bhadrachalam: నేటి నుంచి రాములోరి కల్యాణానికి స్పెషల్‌ టికెట్లు!

భద్రాచలం దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150 ల టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

SriRam Navami 2024: శ్రీరామనవమి పండుగను ఇంట్లో ఇలా జరుపుకోండి..!
New Update

Sri Ramanavami 2024 Kalyanam Tickets: ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో రామయ్య కల్యాణోత్సవం జరగునున్న విషయం తెలిసిందే. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాద్రి చేరుకుంటున్నారు. స్వామి వారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులకు ఆన్‌లైన్‌ తో పాటు కౌంటర్లలో టికెట్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

భద్రాచలం దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.వెయ్యి, రూ.300, రూ.150 ల టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ టికెట్లు కాకుండా మిథిలా మండపానికి సమీపంలో రామయ్య కల్యాణోత్సవ వేడుకను దగ్గర్నుంచి చూసేందుకు ప్రత్యేకంగా సెక్టార్లను ఏర్పాటు చేశామని చెప్పారు. అందుకు సంబంధించిన రూ.10 వేలు, రూ.5 వేల టికెట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం నుంచి విక్రయించనున్నట్లు వెల్లడించారు.

Sri Ramanavami 2024 Kalyanam Tickets

కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు.ఇక భక్తుల ఇంటి వద్దకే గోటి తలంబ్రాలు పంపిస్తామని ఆర్టీసీ, తపాలా శాఖలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Book Tickets Here

Also Read: విప్రోలో భారీగా ఉద్యోగావకాశలు.. ఇంకేందుకు ఆలస్యం మరి!

#sri-ramanavami-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe