Back Acne: వీపు, బాడీ పై పింపుల్స్ వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..!

సహజంగా పింపుల్స్ ఎక్కువగా మొహం పై కనిపిస్తాయి. కానీ కొంత మందికి బాడీ లేదా వీపు పైన కూడా రావడం జరుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఈ చిట్కాలు పాటిస్తే చాలు. షుగర్, ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా , రోజూ స్నానం, క్లీన్సింగ్, నీళ్లు ఎక్కువగా తాగడం, టీ ట్రీ ఆయిల్ అప్లై చేయడం మంచిది.

New Update
Back Acne: వీపు, బాడీ పై పింపుల్స్ వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి..!

Back Acne: పింపుల్స్ చాలా మందిలో కనిపించే కామం ప్రాబ్లమ్. ఇవి శరీరంలో ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తయ్యే ప్రదేశాలు.. ఛాతి, వీపు, మొహం పై కనిపిస్తాయి. చర్మ రంద్రాల్లో చెమట, నూనె, డెడ్ స్కిన్ సెల్స్ బ్లాక్ అవ్వడం ఈ సమస్యకు ప్రధాన కారణం. టైట్ షర్ట్స్, స్పోర్ట్స్ బ్రాస్ ధరించినప్పుడు రాపిడి కారణంగా సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది వీపు పై చికాకు పుట్టించే మొటిమలకు దారి తీస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వీటి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాక్ యాక్నే తొలగించే చిట్కాలు

లూజ్ దుస్తులు ధరించడము

కొంత మంది శరీరానికి గ్యాప్ లేకుండా టైట్ బట్టలు వేసుకుంటారు. ఇలా వేసుకోవడం మంచిది కాదు. మ్యుఖ్యంగా చెమట ఎక్కువగా ఉండే వారికి లూజ్ వస్త్రాలను ధరించాలి. ఎక్కువ చెమట కారణంగా రాపిడి ఏర్పడి.. వీపు పై మొటిమలకు దారి తీస్తుంది.

ప్రతీ రోజూ స్నానం చేయాలి

బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము, దూళి, బ్యాక్టీరియా శరీరం పై చేరతాయి. శుభ్రంగా స్నానం చేయకపోతే ఇవి చర్మ రంద్రాల్లో పేరుకుపోయి బాడీ పై మొటిమలను కలిగిస్తాయి. అందుకే ప్రతీ రోజూ స్నానం చేయడం మంచిది. ముఖ్యంగా వేసవి కాలంలో రోజుకు రెండు సార్లు చేస్తే మరీ మంచిది.

టీ ట్రీ ఆయిల్ అప్లై చేయడం

శరీరం పై మొటిమల సమస్య ఉన్నవారు ఎక్కువ ఆలస్యం చేయకూడదు. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. టీ ట్రీ ఆయిల్ ఈ సమస్యకు మంచి చిట్కా. పింపుల్స్ ఉన్న ప్రదేశాల్లో ఈ ఆయిల్ అప్లై ఉపశమనం కలుగుతుంది. దీనిలోని యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Also Read: Break Fast: నూనె లేకుండా ఈ అల్పాహారం ట్రై చేయండి.. ఆరోగ్యంగా ఉంటారు

publive-image

క్లీన్సింగ్

బాడీ క్లీన్సింగ్ చాలా ముఖ్యం. ప్రభావిత ప్రాంతాల్లో సున్నితమైన సోప్ లేదా బాడీ వాష్ రోజూ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే దుమ్ము, దూళి తొలగించడానికి తోడ్పడుతుంది.

ఎక్స్ ఫోలియేషన్

ఎక్స్ ఫోలియేషన్ చేయడం ద్వారా శరీరం పై డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. అంతే కాదు అధిక ఆయిల్స్ బయటకు పంపి చర్మాన్ని క్లియర్ గా ఉంచుతుంది. చర్మం పై బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ సమస్యను కూడా తగ్గిస్తుంది.

హెల్తీ డైట్

డైట్ లో ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంత వరకు హై షుగర్, హై ఫ్యాట్ ఫుడ్స్ కు దూరంగా ఉండడం మంచిది. ఇవి మొటిమలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుంది.

నీళ్లు ఎక్కువగా తాగాలి

నీళ్లు ఎక్కువగా తీసుకోవడం చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇది పింపుల్స్ సమస్యను కూడా తగ్గిస్తుంది. అందుకే రోజు 5 లీటర్ల నీటిని తప్పకుండా తాగాలి.

Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు