Bay leaves Tips: ఈ ఆకుతో.. డాన్డ్రప్ సమస్య దెబ్బకు మాయం జుట్టు సమస్యల్లో చాలా మందిని వేదించేది డాన్డ్రప్. దీన్ని తొలగించడానికి రకరకాల షాంపోస్, ప్రాడక్ట్స్ వాడతారు. కానీ కొన్ని సార్లు ఫలితమేమి ఉండదు. ఈ సమస్యను తగ్గించడానికి అద్భుతమైన పరిష్కారం బిర్యానీ ఆకుతో చేసే హెయిర్ మాస్క్. తయారి విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 11 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Bay leaves Tips: ఈ మధ్య కాలం ఆడపిల్లలు, మగవారు ఎక్కువగా ఎదుర్కుంటున్న సమస్య డాన్డ్రప్. ఈ సమస్య పరిష్కరించడానికి హెయిర్ వాష్, హెయిర్ ప్రొడక్ట్స్, షాంపోస్ ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ కొన్ని సార్లు ఫలితమేమి లేకపోయేసరికి నిరాశ చెందుతారు. ఇలాంటి సమస్య ఉన్నవారికి బే లీవ్స్ (బిర్యానీ ఆకు) తో తయారు చేసే హెయిర్ మాస్క్ లు అద్భుతమైన పరిష్కారం. అసలు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క ఆకుతో డిఫరెంట్ మాస్క్ లు తయారు చేసుకోవచ్చు. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.. బే లీఫ్ విత్ కోకోనట్ ఆయిల్, అలోవెరా జెల్ ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకులు పొడిలో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్, అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది డాన్డ్రప్ తో పాటు జుట్టు రాలే సమస్యకు కూడా మంచి చిట్కా బే లీఫ్ విత్ అవకాడో మాస్క్ బే లీఫ్ పౌడర్ లో బాగా మెత్తగా స్మ్యాష్ చేసిన అవకాడో వేసి మిక్స్ చేయాలి. దీని జుట్టుకు అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయండి. బే లీఫ్ విత్ మెంతి సీడ్స్ హెయిర్ మాస్క్ ముందుగా రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి . ఆ తర్వాత వీటిని వన్ టీ స్పూన్ బే లీఫ్ పౌడర్ లో మిక్స్ చేసి 15 నిమిషాల పాటు జుట్టుకు అప్లై చేయాలి. జుట్టు కాస్త తడి చేసి అప్లై చేయండి. బే లీఫ్ విత్ బనానా హెయిర్ మాస్క్ బనానా స్మ్యాశ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ బే లీఫ్ పౌడర్ లో స్మ్యాష్డ్ బనానా కలిపి జుట్టుకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో వాష్ చేస్తే సరిపోతుంది. దీంతో రోజ్ వాటర్ కూడా కలపాలి . Also Read: celery juice: ఈ జ్యూస్ తాగితే.. మీ ఆరోగ్యానికి ఏ బాధ ఉండదు.. ట్రై చేయండి #hair-masks-with-bay-leaves #benefits-of-bay-leaves మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి