Skin Fasting: స్కిన్ ఫాస్టింగ్.. ఎప్పుడైనా విన్నారా..? దీంతో మీ చర్మం మరింత యవ్వనం

స్కిన్ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్. స్కిన్ ఫాస్టింగ్ అంటే కొన్ని వీక్స్ లేదా కొన్ని రోజుల వరకు బ్యూటీ ప్రాడక్ట్స్ కు దూరంగా ఉండడం. ఇలా చేస్తే చర్మాన్ని డీటాక్స్ చేయడంతో పాటు ఉత్పత్తుల కారణంగా బయటకు వెళ్లే నేచురల్ ఆయిల్స్ ను నిలిపి తేమగా, యవ్వనంగా చేస్తుంది.

New Update
Skin Fasting: స్కిన్ ఫాస్టింగ్.. ఎప్పుడైనా విన్నారా..? దీంతో మీ చర్మం మరింత యవ్వనం

Skin Fasting: స్కిన్ ఫాస్టింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు బాగా ట్రెండ్ అవుతోంది. ప్రతీ రోజు మొహానికి సన్ స్క్రీన్, క్లెన్సర్‌, టోనర్ సీరమ్‌ అని రకరకాల ఫేస్ ప్రాడక్ట్స్ అప్లై చేస్తుంటారు. ఇలాంటి రకరకాల ఉత్పత్తుల కారణంగా కొన్ని సార్లు చర్మం పై చిరాకు, మంట వస్తుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి స్కిన్ ఫాస్టింగ్ చాలా అవసరం. ఈ సమస్యలను తగ్గించడానికే స్కిన్ ఫాస్టింగ్.

అసలు స్కిన్ ఫాస్టింగ్ అంటే ఏమిటి

స్కిన్ ఫాస్టింగ్ అనే ఈ పదం జపనీస్ లో పుట్టింది. కానీ ఇప్పుడు ఇది అన్ని చోట్ల బాగా ట్రెండ్ అవుతోంది. ఒక నిర్ణిత సమయం వరకు బ్యూటీ ప్రాడక్ట్స్ కు దూరంగా ఉండడం దీని ముఖ్య ఉద్దేశం. స్కిన్ ఫాస్టింగ్ ద్వారా చర్మలోని ఆయిల్స్ ను నిలిపి.. చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపించడానికి జపనీయులు ఈ పద్దతిని పాటిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Palmyra Sprout: తాటి తేగలు తింటే.. ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..!

దీన్ని ఎలా పాటించాలి

స్కిన్ ఫాస్టింగ్ లో భాగంగా కొన్ని వీక్స్ లేదా కొన్ని రోజుల వరకు చర్మ సౌందర్య ఉత్పత్తులు అప్లై తగ్గించడం లేదా దూరంగా ఉండడం చేయాలి. రోజు పడుకునే ముందు చల్లటి నీళ్లతో మొహన్నీ కడుక్కోవడం.. మళ్ళీ ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రపరచడం చేయాలి. రోజు ఇలా చేస్తే చర్మలోని టాక్సిన్స్ ను బయటకు వెళ్లిపోతాయి. అలాగే చర్మ ఉత్పత్తుల కారణంగా చర్మంలో నుంచి తొలగిపోయే సహజ ఆయిల్స్ ను నిలిపి వేసి.. తేమగా, యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. రకరకాల బ్యూటీ ప్రాడక్ట్స్ కారణంగా చర్మాన్ని రక్షించే పొర మెల్లి మెల్లిగా క్షీనిస్తుంది. దీన్ని దృడంగా చేయడానికి స్కిన్ ఫాస్టింగ్ సరైన ఎంపిక.

publive-image

స్కిన్ ఫాస్టింగ్ తో కలిగే లాభాలు

  • కొద్దీ రోజుల వీటికి దూరంగా స్కిన్ ప్రాడక్ట్స్ కు దూరంగా ఉంటే.. చర్మాన్ని రెజువెనేట్ చేయడానికి సహాయపడును.
  • చర్మం హీల్ అవ్వడానికి తోడ్పడుతుంది. అలాగే స్కిన్ లోని సహజ తేమను కాపాడుతుంది.
  • స్కిన్ ఫాస్టింగ్ తరువాత మళ్ళీ.. మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఒక క్రమ పద్దతిలో స్టార్ట్ చేయాలి. ఇలా చేస్తే చర్మం పై మంచి ప్రభావం ఉంటుంది.

Also Read: Blue Light Effects: బ్లూ లైట్ నుంచి కంటిని రక్షించే టిప్స్ .. తప్పక తెలుసుకోండి

Advertisment
Advertisment
తాజా కథనాలు