Health tips: లెమన్ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

నిమ్మలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. నిమ్మతో జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మనీరు మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు. గోరువెచ్చని నీటితో నిమ్మరసాన్ని పరగడుపున తాగితే జీవక్రియ, శక్తి స్థాయి పెరుగుతుంది.

Health tips: లెమన్ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?
New Update

నిమ్మకాయలు అధిక మొత్తంలో విటమిన్ సీ కలిగి ఉంటాయి. ఒక ఔన్సు నిమ్మరసం తాగటం వల్ల మీ రోజువారీ అవసరాలలో 13శాతం విటమిన్ సీ లభిస్తుంది. ఇందులో పొటాషియం, థయామిన్, విటమిన్ బి-6, ఫోలేట్ కూడా ఉంటాయి. నిజానికి నిమ్మకాయ నీళ్లు తాగటం మీరు హైడ్రేటెడ్‌గా ఉంటారు.



➼ నిమ్మకాయ నీళ్లతో చాలా ప్రయోజనాలున్నాయి:

➼ మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

➼ ఇది మీ ఆకలిని స్టెబిలైజ్‌ చేస్తుంది.

➼ ఇది మీ శక్తిని పెంచుతుంది.

➼ నిమ్మరసం మీ కణాలను రక్షిస్తుంది

➼ క్లియర్ స్కిన్‌కి హెల్ప్ అవుతుంది

➼ ఉబ్బరాన్ని నియంత్రిస్తుంది

➼ జీర్ణక్రియకు సహాయపడుతుంది

➼ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది

నిమ్మనీరు తాగడం వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా?

నిజానికి నిమ్మకాయ నీరు తాగడం వల్ల ఎలాంటి సమస్యలుండవు. కానీ అతిగా ఏది చేసినా అనర్థమే. అధిక మొత్తంలో తాగడం వల్ల గుండెల్లో మంట, రిఫ్లక్స్, క్యాంకర్ పుండ్లు లేదా నోటి పూతలకి కారణం కావచ్చు. అధిక మొత్తంలో నిమ్మనీరు తాగడం వల్ల దంత క్షయం లేదా ఎనామిల్ కోతకు గురయ్యే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. దంతాల సమస్యల ప్రమాదం ఉన్నవారు నిమ్మకాయ నీటిని క్రమం తప్పకుండా తీసుకునే ముందు దంతవైద్యుడిని సంప్రదించాలి. ఇక ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. జీవక్రియను కూడా పెంచుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థకు మంచిది. ఖాళీ పొట్టతో దీన్ని తాగితే శరీరంలోని వ్యర్థాలని తొలగించి శుభ్రపరుస్తుంది. అయితే నిమ్మలోని అసిడిక్ గుణం పళ్ళపై ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. అందుకే నిమ్మరసాన్ని ఎప్పుడూ నీళ్లతో కలిపే తీసుకోవాలి. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను నిమ్మలోని విటమిన్ సీ నివారిస్తుంది.

#lemon-water-benefits
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe