Nutritional Deficiency in Children: చాలా మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతుంటారు. పిల్లల చిన్న వయసులో పేరెంట్స్ పిల్లల ఆహారపు అలవాట్ల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలకు సరైన పోషకాహారం అందించకపోతే వారిలో పోషకాహార లోపాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. పిల్లలో ఎక్కువగా కనిపించే పోషకాహార లోపాలు ఇవే..
పిల్లల్లో కనిపించే పోషకాహార లోపాలు.. తీసుకోవాల్సిన ఆహారాలు
ఐరన్ లోపం
శరీరంలో ఊపిరితిత్తుల నుంచి శరీర బాగాలన్నింటికీ ఆక్సీజన్ సరఫరా చేయడంలో ఐరన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఐరన్ శాతం తగ్గడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయి పిల్లలో రక్త హీనత వచ్చే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో రక్త హీనత సమస్య తగ్గించడానికి వారి ఆహారంలో వీటిని చేర్చండి. చిక్కుళ్ళు, ఆకుకూరలు, రెడ్ మీట్, బీట్ రూట్ జ్యూస్, తింటే శరీరంలో ఐరన్ కంటెంట్ పెరగడానికి సహాయపడతాయి.
విటమిన్ D లోపం
పిల్లల ఎముకలను దృడంగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ D ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా విటమిన్ D ముఖ్య పాత్ర వహిస్తుంది. విటమిన్ D పోషకాహార సమస్యతో బాధపడే పిల్లలకు ఫ్యాటీ ఫిష్ , మిల్క్, ఫిష్ ఆయిల్స్ , యోగర్ట్ వంటి విటమిన్ D ఎక్కువగా ఉండే ఆహారాలను ఇవ్వండి.
జింక్ పోషకాహార లోపం
పిల్లలు ఎదుగుదల, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ, కాగ్నిటివ్ స్కిల్స్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జింక్ పోషకాహార లోపంతో బాధపడే వాళ్ళు దానిని అధికమించడానికి వారి ఆహారంలో మాంసాహారులు, పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, చిరు ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది.
కాల్షియం లోపం
కాల్షియం పిల్లల్లో ఎముకల దృఢత్వం, కండరాళ్ళ పనితీరు, గుండె ఆరోగ్యాన్ని నియంత్రించడంలో సహాయ పడును. శరీరంలో కాల్షియం లోపంతో బాధపడే వాళ్ళు ఫిష్, నట్స్, ఆకుకూరలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, టోఫు వంటి కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
Also Read: Hypertension Tips: మీలో రక్త పోటు సమస్య ఉందా..? ఇవి తప్పక తెలుసుకోండి..!