మనల్నెవడ్రా ఆపేదీ!: ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్క

ఎన్నికల ప్రచారంలో బర్రెలక్క దూసుకుపోతోంది. ప్రత్యర్థులు ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించినా, బెదిరింపులకు పాల్పడినా తగ్గేదే లేదంటూ ప్రజల్లోకి వెళ్తోంది. బర్రెలక్కకు రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియా ఆమెకు అండగా నిలుస్తోంది.

మనల్నెవడ్రా ఆపేదీ!: ప్రచారంలో దూసుకుపోతున్న బర్రెలక్క
New Update

Barrelakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా నిలిచిన బర్రెలక్క అలియాస్ శిరీష ప్రచారంలో దూసుకుపోతోంది. మీ అందరి కోసం అసెంబ్లీలో కొట్లాడుతానంటూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళుతోంది. నిరుద్యోగుల తరఫున కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే క్యాండిడెట్‌గా పోటీ చేస్తున్న శిరీష.. ఊరు వాడా తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. తనను ఓటు వేసి గెలిపిస్తే మీ అసెంబ్లీలో అందరి సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో కొట్లాడుతానని.. ఉద్యోగాలు వచ్చేదాకా వదలనని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇటీవల ప్రచారానికి వెళ్లిన బర్రెలక్క, ఆమె తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బర్రెలక్క కన్నీరు పెడుతూ నేనేం చేశానని నాపై దాడి చేస్తున్నారు..? ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు నాకు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పలువురు మేధావులు, యువకులు, ఇతర రాష్ర్టాలకు చెందిన వారు కూడా తరలివచ్చి బర్రెలక్కకు మద్దతు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తనకు వస్తున్న అనూహ్య మద్దతుతో శిరీష రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో, క్షేత్ర స్థాయిలో కూడా బర్రెలక్క సత్తా చాటుతోంది. తొలుత లైట్ తీసుకున్న ప్రధాన అభ్యర్థులు కూడా ఇప్పుడామెను చూసి భయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డితో పాటు ఆ నాయకులపై ట్రాఫిక్ చలాన్లు ఎంతున్నాయో తెలుసా!

అండగా ఉంటా:
తనను కొల్లాపూర్‌ ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందరికీ అండగా ఉంటానంటూ ఊరూవాడ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ తన విజిల్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. స్థానికంగా రోడ్లు, మంచినీరు సదుపాయాలతో పాటు మౌలిక వసతులు అన్నీ అందేలా కృషిచేస్తానని చెబుతున్నారు. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల్లా కాకుండా ప్రజల కోసం నిత్యం కొట్లాడుతానని భరోసా ఇస్తున్నారు. 1972 నుంచి కొల్లాపూర్‌లో ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా నిలబడలేదని.. కానీ తాను ధైర్యంగా నిలబడి కొట్లాడుతానని చెబుతున్నారు. శిరీష ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తనకు లభిస్తున్న ప్రజాదరణను చూసి అర్ధరాత్రి సమయంలో కొందరు ప్రచారం బంద్‌ చేయాలంటూ ఫోన్‌కాల్స్‌ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బర్రెలక్క తెలిపారు. డబ్బులిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: దుబ్బాక కారుదా, కమలానిదా..! రెండోసారి గెలుపు కోసం శ్రమిస్తున్న రఘునందన్

రోజురోజుకూ పెరుగుతున్న మద్దతు
నిరుద్యోగ సమస్యలపై ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్న శిరీషకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. స్థానిక ప్రజలతో పాటు నిరుద్యోగ యువత ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. అలాగే ఇతర రాష్ర్టాల నుంచి పలువురు మేధావులు మద్దతు తెలుపుతున్నారు. మద్దతు తెలపడమే కాకుండా ఆమెకు విరాళాలు ఇస్తున్నారు. కొందరైతే ఏకంగా కొల్లాపూర్‌కు వచ్చి ఆమె తరపున ప్రచారం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న బర్రెలక్కపై దాడులకు పాల్పడడం దారుణమని, ఆమెకు తన పూర్తి మద్దతు ఉంటుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే హైకోర్టు చెందిన న్యాయవాదులు కొందరు ఆమెకు మద్దతు తెలిపారు. శిరీషకు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బర్రెలక్క మేనిఫెస్టో ఇదే..
1. నిరుద్యోగుల అంశంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. సరైన సమయంలో నోటిఫికేషన్లు వచ్చేలా నిలదీస్తా.
2. పేదలకి ఇండ్ల నిర్మాణం కోసం కృషి చేస్తా
3. ఆర్టికల్ 41 ప్రకారం నిరుద్యోగులకు భృతి ఇప్పిస్తా
4. ప్రతి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు
5. ఉచిత విద్య, వైద్యం కోసం పాటుపడుతా
6. నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు – ఫ్రీ కోచింగ్
7. యువత ఉన్నత చదువులకు ఫ్రీ కోచింగ్

#telangana-news #telangana-elections-2023 #barrelakka #barrelakka-manifesto
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe