Bandi Sanjay: భగ్గుమంటున్న బండి సంజయ్.. బీజేపీలో అసలేం జరుగుతోంది?

అనేక విషయాల్లో తన మాటను బీజేపీ హైకమాండ్ పట్టించుకోకపోవడంతో బండి సంజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా తనకు రెండు సీట్లలో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

New Update
Telangana: సీఎంగారు ఇదేం పని.. రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ సంచలన లేఖ..!

Bandi Sanjay: బీజేపీ హైకమాండ్ పై బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చేసిన వినతులను ఒక్కటి కూడా పట్టించుకోకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తనను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించి స్టార్ క్యాంపెయినర్ గా నియమించాలని హై కమాండ్ కు ఇటీవల బండి సంజయ్ (Bandi Sanjay) విజ్ఞప్తి చేశారు. ఇందుకు బీజేపీ (BJP) అధిష్టానం నో చెప్పింది. అయితే.. రెండు సీట్లలో పోటీ చేయడానికైనా అవకాశం ఇవ్వాలని బండి కోరారు. దీనికి కూడా హైకమాండ్ అంగీకరించలేదు. ఈటల రాజేందర్ కు (Eatala Rajender) రెండు చోట్ల పోటీకి అవకాశం ఇచ్చి.. తనకు ఇవ్వకపోవడంతో బండి సంజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: పార్టీ మార్పుపై డీకే అరుణ సంచలన ప్రకటన!

బండి సంజయ్ అనుచరులు సైతం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా సీట్ల కేటాయింపులోనూ తన మాటను పట్టించుకోవడం లేదని.. తన వారిని పక్కన పెడుతున్నారని బండి అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో తన వారికి అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తానను నమ్మి పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో బండి సీరియస్ అవుతున్నట్లు సమాచారం.

తన జిల్లాకు చెందిన సిరిసిల్ల టికెట్ ను తాను సూచించిన వ్యక్తికి కాకుండా.. ఇతర జిల్లాకు చెందిన రాణి రుద్రమ కు ఇవ్వడంపై బండి ఫైర్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. బండి సంజయ్ ఆగ్రహం చల్లారుతుందా? ఎన్నికల్లో ఆయన యాక్టివ్ గా పని చేస్తారా? అధిష్టానం బండి సంజయ్ కు ఎలాంటి హామీ ఇవ్వనుంది? అన్న అంశాలపై బీజేపీలో జోరుగా చర్చ సాగుతోంది.

ఇది కూడా చదవండి: ఆ అధికారులను వెంటనే తొలగించండి: రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్

Advertisment
తాజా కథనాలు