TS Politics: 2 నెలల్లో రూ.10 వేల కోట్లు అప్పు? బండి సంజయ్‌ సంచలనం

మీకు, కేసీఆర్‌కు తేడా ఏముందంటూ సీఎం రేవంత్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ఫైర్ అయ్యారు. 2 నెలల్లో రూ.10 వేల కోట్లు అప్పు చేశారా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారని నిలదీశారు.వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేసే దమ్ముందా అని మండిపడ్డారు.

Bandi Sanjay: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
New Update

Bandi Sanjay on KCR and Revanth Reddy: 'సీఎం గారు… మీకు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముంది? 10 ఏళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పు తెస్తే… మీరు 2 నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తే…. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని మీరు మోసం చేయబోతున్నారు? అరకొర హామీల అమలుతో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవాలనుకుంటున్నరు’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేంద్రం నయా పైసా సాయం చేయలేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. 'పైగా తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని బుకాయిస్తారా? మోదీ పాలనలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చింది… అసలు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలన సాగుతోందంటే మోదీ గారు ఇస్తున్న నిధుల పుణ్యమే..దమ్ముంటే ఆ నిధులపై బహిరంగ చర్చకు సిద్ధం' అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మలిదశ ప్రజాహిత యాత్రలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి కేంద్రంలో బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

బండి ఏమన్నారంటే…?

'ఇయాళ సీఎం గారు బీఆర్ఎస్ కు, బీజేపీకి ఏమీ తేడా లేదని అంటున్నడు… పదేళ్లలోనే వందేళ్లకు సరిపడా విధ్వంసం కేసీఆర్ చేస్తే… బీఆర్ఎస్ చూస్తూ ఊరుకుందట.. తెలంగాణకు నయాపైసా ఇవ్వలేదట… నేనడుగుతున్నా… వంద రోజుల్లోనే మీరు 6 గ్యారంటీలన్నీ అమలు చేస్తానన్నారు. 75 రోజులు దాటిపోయాయి. ఎన్నికల కోడ్ రాబోతోంది? మరి రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతు బంధు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానన్నారు కదా ఏవి? మహిళలకు నెలనెలా రూ.2,500లు ఇస్తానన్నారు ఎందుకివ్వడం లేదు? ఆసరా పెన్షన్ రూ.4 వేలు ఇస్తానన్న హమీ ఎందుకు అమలు చేయడం లేదు? రూ.5 వందలకే గ్యాస్ సిలిండర్, 200 వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చి చేతులు దులుపేసుకోబోతున్నరు. మిగిలిన గ్యారంటీలన్నీ గాలికొదిలేసి ప్రజలను మోసం చేయబోతున్నరు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అరకొర హామీలను రేషన్ కార్డులు ఉన్నోళ్లకే ఇస్తారట… గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం 10 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి వాళ్ల సంగతేమిటి. ఎవరు ప్రజలను మోసం చేస్తున్నారో, ఎవరు పేదలను ఆదుకుంటున్నారో ప్రజలు ఆలోచించాలి. మోదీ ప్రభుత్వం తెలంగాణలో 2 లక్షల 40 వేల ఇండ్లు ఇస్తే ఒక్క ఇల్లు కూడా కట్టివ్వకుండా మోసం చేసిన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వానిది. తెలంగాణలో 90 లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యం అందిస్తోంది మోదీ ప్రభుత్వం. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలన సాగుతోంది కేంద్రంవల్లే. గ్రామాలకు నిధులిస్తోందే మోదీ ప్రభుత్వం. అయినా ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నయ్…

మీరు ఓటేయకపోయినా తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులిచ్చిన మోదీకి మద్దతిచ్చి ఓట్లేస్తే తెలంగాణను అన్ని విధాలా ఆదుకుంటారు. 5 వందల ఏళ్ల కల రామ మందిర నిర్మాణం. ఆ కలను సాకారం చేసిన మహానేత నరేంద్రమోదీ. రైతులకు ఎరువుల, కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఎకరాకు రూ.18 వేలు సబ్సిడీ అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదే…

కేసీఆర్ కు, మీకు(కాంగ్రెస్) తేడా ఏముంది? 10 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పులు తెస్తే… మీరు 2 నెలల్లోనే 10 వేల కోట్ల అప్పు తెచ్చారు. ఇంకా అప్పులు కావాలంటూ తిరుగుతున్నారు. కేసీఆర్ పాలనలో పుట్టబోయే బిడ్డపైనా లక్షన్నర అప్పుల భారం మోపితే… కాంగ్రెస్ తీరును చూస్తుంటే…పుట్టబోయే మనవడు, మనవరాళ్లపైనా లక్షల కొద్ది అప్పులు భారం మోపేందుకు సిద్దమైనరు.

పైగా తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని బుకాయిస్తారా? మోదీ పాలనలో తెలంగాణ అభివ్రుద్ధి కోసం దాదాపు 10 లక్షల కోట్లు ఖర్చు చేసింది. అసలు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలన సాగుతోందంటే మోదీ గారు ఇస్తున్న నిధుల పుణ్యమే.. ఈ మీరు రోడ్లపై రివ్వున తిరుగుతున్నారంటే… ఆ రోడ్లకు పైసలిచ్చింది మోదీగారే. రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు అందుతున్న రేషన్ బియ్యాన్ని ఉచితంగా ఇస్తోంది మోదీగారే.. మీరు 5 వందలకే సిలిండర్ ఇస్తామంటున్నారు…అసలు ఆ గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇచ్చింది మోదీ గారే….

నేను సవాల్ చేస్తున్నా… తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్దం. డేట్, టైం, వేదిక ఫిక్స్ చేయండి. మీరు చేసినా… లేదంటే మేమైనా చేస్తాం… మా తరపున కిషన్ రెడ్డి గారిని ఒప్పించి పంపిస్తాం… దమ్ముంటే మీరు రండి… తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో… కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏమిచ్చాయో ప్రజల సమక్షంలో తేలుద్దాం.. ఇకనైనా అబద్దాలు, డ్రామాలాడటం మాని వాస్తవాలను ప్రజల ముంచుందాం రండి…

రేపు 5 వందలకే సిలిండర్, 2 వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకం అమలు చేసే కార్యక్రమాలకు రమ్మంటే రావడానికి బీజేపీకి ముఖం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు… నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గున్నట్లుంది…

మీకు దమ్ముంటే… చిత్తశుద్ది ఉంటే.. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వాటిని హామీలన్నీ అమలు చేసే మీకు దమ్ముందా? దరఖాస్తు చేసుకున్న 10 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులిచ్చే దమ్ముందా?' అంటూ బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: డీల్‌ డన్.. ఏపీలో బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటి చేస్తుందంటే?

WATCH:

#bandi-sanjay
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe