Ongole: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను హవాలా చేశానని, భూకబ్జాలు చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై వస్తున్న అన్ని ఆరోపణలపై విచారణ చేయాలన్నారు. ఎవరూ అవినీతి పరులో బహిరంగ చర్చకు వస్తారా? మైనారిటీ ఆస్తులను అక్రమించుకొంది దామచర్ల కాదా? అని ప్రశ్నించారు.
విల్లాస్ విషయంలో ఏవైనా ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేసుకోవాలన్నారు. తాను భూ ఆక్రమణ చేస్తే విచారణకు సిద్ధమన్నారు. దాడులు.. దౌర్జ్యనం చేసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఒక మాజీ మంత్రిని ఒకరు చొక్కా విప్పి సవాల్ చేస్తూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు.
Also Read: కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు.. ఇద్దరు నిందితులు అరెస్ట్..!
కేసులకు తాను భయపడనని.. తాను తప్పు చేశానంటే దేనికైనా సిద్ధమని అన్నారు. తన కుటుంభంపై దామచర్ల కావాలనే కక్ష పూరిత్తంగా వ్యవహరిస్తున్నాడన్నారు. తాను ఇచ్చిన పట్టాలు దొంగవి అనే వారు.. ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి విచారణకు సిద్ధంమని సవాల్ చేశారు.
తనకు ప్రశ్నించే తత్వం ఉండటం వల్ల.. తన సొంత పార్టీ వైసీపీలో కూడా ఇబ్బంది పడి, ఆస్తులు కొల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుగా మాట్లాడిన రోజు బహిరంగంగా క్షమాపణ చెప్పాను.. అది నా సంస్కారం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కార్పొరేటర్ల విషయంలో ఒకటే చెప్పాను.. నీతిగా ఉండాలి అంటే ఉండమన్నాను, లేకపోతే నిర్ణయం వారిదేనని అన్నాను. రోజు వారికీ నేను కాపలా కాయలేను..కదా.. అధికారం ముఖ్యం కాదు..భవిష్యత్ అవసరం అంటూ కామెంట్స్ చేశారు.