Unstoppable Promo: అన్ స్టాపబుల్ షోలో బాలయ్య స్టెప్పులు.. 'భగవంత్' కేసరి టీం సందడి

బాలయ్య.. అన్ స్టాపబుల్(Unstoppable) సీజన్ 3 తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇక మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం సందడి చేశారు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన  అన్ స్టాపబుల్ విత్ NBK సూపర్ ఎంటర్ టైనింగ్ 'టాక్' షోగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూర్తయిన సీజన్ 1,2 సూపర్ హిట్ అయ్యి TRP ల మోత మోగించాయి. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో ఓటీటీ వేదికైన  'ఆహా' లో స్ట్రీమ్' అవుతుంది. 

New Update
Unstoppable Promo: అన్ స్టాపబుల్ షోలో బాలయ్య స్టెప్పులు.. 'భగవంత్' కేసరి టీం సందడి

Unstoppable: బాలయ్య.. అన్ స్టాపబుల్(Unstoppable) సీజన్ 3 తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇక మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం సందడి చేశారు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన  అన్ స్టాపబుల్ విత్ NBK సూపర్ ఎంటర్ టైనింగ్ 'టాక్' షోగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పూర్తయిన సీజన్ 1,2 సూపర్ హిట్ అయ్యి TRP ల మోత మోగించాయి. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో ఓటీటీ వేదికైన  'ఆహా' లో స్ట్రీమ్' అవుతుంది.

గతంలో బాలయ్య హోస్ట్ చేసిన రెండు సీజన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సీజన్ కూడా బాలయ్య మంచి జోష్ తో స్టార్ట్ చేశారు. అన్ స్టాపబుల్ షో నిర్వాహకులు ఫస్ట్ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను విడుదల చేశారు.  బాలయ్య ప్రోమోలో.. మేము తప్పు చేయలేదని మీకు తెలుసు, తలవంచమని తెలుసు, అనుకున్నది అందాం .. అనిపించింది చేద్దాం, ఎవడాపుతాడో చూద్దాం అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చాడు.

ఇక అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ లో బాలయ్య నటించిన 'భగవంత్' కేసరి టీం సందడి చేసింది. అనిల్ రావిపూడి, కాజల్, శ్రీలీల ఈ టాక్ షోలో పాల్గొన్నారు. బాలయ్య తన చమత్కారంగా మాట్లాడుతూ అతిథులతో ఓ ఆట ఆడుకున్నారు. కాజల్, శ్రీలీల, అనిల్ రావిపూడితో కలిసి సందడి చేసి నవ్వులు పూయించారు. ప్రోమోలో బాలయ్య అనిల్ రావిపూడిని నీకు తమన్నా కు గొడవేంటి అని అడగగా.. అనిల్ రావిపూడి మీరు భలే బుక్ చేస్తారు..సార్ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు.

publive-image

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే భగవంత్ కేసరి టీం బాలయ్య అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ అక్టోబర్ 17 న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: Pawan Kalyan: పవన్ మూడు పెళ్ళిళ్ళ పై జగన్ షాకింగ్ కామెంట్స్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు