Ayodhya Rituals: ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు కార్యక్రమాలు.. ఏడు రోజుల క్రతువులు ప్రారంభం!

జనవరి 22న అయోధ్యలో రామమందిరం ' ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి(జనవరి 16) నుంచి జనవరి 22వరకు ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్నాయి. ప్రాయశ్చిత, కర్మకుటి పూజలతో మొదలుకానున్న వేడుకలు జనవరి 22న ప్రాణ్‌ప్రతిష్ఠ కార్యక్రమంలో ముగుస్తాయి.

Ayodhya Rituals: ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు కార్యక్రమాలు.. ఏడు రోజుల క్రతువులు ప్రారంభం!
New Update

సరయు నది(Sarayu) ఒడ్డున ఉన్న ఉత్తరప్రదేశ్ పట్టణం అయోధ్య.. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఈ నగరం గురించే చర్చ. జనవరి 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దేశం చూపు నెలకొంది. అయోధ్య గురించి ఎలాంటి సమాచారం బయటకు వస్తున్నా అది ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది. ఇక ఇవాళ్టి(జనవరి 16)నుంచి ప్రతిష్ఠాపన వేడుకలు మొదలవనున్నాయి. ఏడు రోజుల పాటు ఇవి జరగనున్నాయి. జనవరి 22న ప్రధాని మోదీ(Modi)అధ్యక్షతన వేలాది మంది వీవీఐపీ అతిథులు పాల్గొనే భారీ వేడుకతో ఈ ఆచారాలు ముగుస్తాయి.

వేడుకకు ముందు కార్యక్రమాలు:

➼ జనవరి 16: ప్రయశ్చిత, కర్మకుటి పూజన్

➼ జనవరి 17: మూర్తి పరిసార్ ప్రవేశ్

➼ జనవరి 18 (సాయంత్రం): తీర్థ పూజన్, జల యాత్ర, గంధాధివస్

➼ జనవరి 18 (ఉదయం): ఔషధాధివాస్, కేశరాధివాస్, ఘృతాధివాస్

➼ జనవరి 19 (సాయంత్రం): ధాన్యాధివస్

➼ జనవరి 20 (ఉదయం): శర్కరాధివాసులు, ఫలాధివాసులు

➼ జనవరి 20 (సాయంత్రం): పుష్పాధివస్

➼ జనవరి 21 (ఉదయం): మధ్యాధివాస్

➼ జనవరి 22 (సాయంత్రం): శయ్యాధివాసులు

కార్యక్రమాల గురించి క్లారిటీగా తెలుసుకోండి:

➼ జనవరి 16న(ఇవాళ) శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ద్వారా నియమించిన అతిధేయుడు విమోచన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముందుగా చెప్పినట్లు సరయూ నది ఒడ్డున 'దశవిధ' స్నానం జరుగుతుంది. ప్రాయశ్చిత, కర్మకుటి పూజలు జరుగుతాయి.

➼ జనవరి 17న రామ్ లల్లా విగ్రహం పారిశర ప్రవేశం జరుగుతుంది.

➼ జనవరి 18న తీర్థపూజ, జల యాత్ర, గంధాధివాస్‌ కార్యక్రమాలు జరుగుతాయి.

➼ జనవరి 19న ఉదయం ఔషధాధివాసం, కేశరాధివస్, ఘృతాధివాసం క్రతువులు జరుగుతాయి. ఆ రోజు సాయంత్రం ధాన్యాధివస్ కార్యక్రమం జరుగనుంది.

➼ జనవరి 20న ఉదయం శర్కరాధివస్, ఫలాధివస్ర్తాలు జరుగుతాయి. సాయంత్రం పుష్పాధివాసం జరగనుంది.

➼ జనవరి 21న ఉదయం మధ్యాధివాసుల క్రతువు, సాయంత్రం శయ్యాధివాసం జరుగనుంది.

➼ జనవరి 22న ప్రాణ్‌ప్రతిష్ఠ(మధ్యాహ్నం ' అభిజీత్ ముహూర్తం'లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.)

Also Read: అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదు- సీఎం

WATCH:

#ayodhya #ram-mandir
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe