Ayanna Patrudu: నన్ను చంపేస్తామని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ చేస్తున్నారు..అయ్యన్న షాకింగ్ కామెంట్స్.!

తనను చంపేస్తామని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకే 14 రౌండ్ల గన్ లైసెన్స్ కోసం అప్లై చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన కుమారుడికి టిక్కెట్ కోసం పార్టీకి అప్లికేషన్ పెట్టినట్లు తెలిపారు.

New Update
Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఈసీ షాక్.. చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు

Ayanna Patrudu: అర్థరాత్రి కాల్ చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికార పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే ఇలా చంపేస్తామని బెదిరిస్తూ కాల్స్ వస్తున్నాయన్నారు. 10 మంది అటాక్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉండేందుకు గన్ లైసెన్స్ కూడా 14 రౌండ్ల కు మార్చాలని కోరుతూ ఆప్లై చేసినట్లు తెలిపారు.

Also Read: వందమంది బాబులు వెయ్యి మంది పవన్ కళ్యాణ్ లు వచ్చినా సరే జగన్ ను ఓడించలేరు: అంబటి

విశాఖలో వైసీపీ నేతలు పేదల భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు దళితులను చంపుతూ మరో వైపు నా ఎస్సీలంటూ గొప్పలు చెప్పుకుంటున్న వ్యక్తి సీఎం జగన్ అని విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ దోచుకున్నదంతా కక్కిస్తామని,..వైసీపీ నేతల అందరి లెక్కలు తేలుస్తామని చెప్పారు.

Also Read: తిరుపతిలో ధనుష్ సినిమా షూటింగ్ వివాదం

ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డానన్నారు. అందుకే తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని పార్టీకి అప్లికేషన్ పెట్టినట్లు తెలిపారు. అలా కాకుండా నాన్ లోకల్ వారికి టికెట్ ఇస్తే ఎలా ఒప్పుకుంటాను అని వ్యాఖ్యనించారు. నన్ను ఆధరించినట్టే మా అబ్బాయిని కూడా ఆదరించాలని.. మా అబ్బాయికి కూడా అన్ని పొలిటికల్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Advertisment
తాజా కథనాలు