Avvenire Tectus: ఖర్చు లేదు.. లైసెన్స్ అక్కర్లేదు.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో గేమ్ ఛేంజర్!

యూఎస్ కి చెందిన స్టార్టప్ Avenair కొత్త  ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తెచ్చింది. సోలార్ ఎనర్జీతో బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 160 కిలోమీటర్లు వెళుతుంది. దీనికి ఇన్సూరెన్స్, లైసెన్స్ అవసరం లేదు. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవాల్సిందే. 

Avvenire Tectus: ఖర్చు లేదు.. లైసెన్స్ అక్కర్లేదు.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో గేమ్ ఛేంజర్!
New Update

Avenair Tectus: అమెరికన్ స్టార్టప్ అవెనైర్ తన వినూత్న ఆల్-సీజన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ టెక్టస్‌ను గ్లోబల్ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. దీని స్పెషాలిటీ ఏమిటంటే..  దీని గరిష్ట వేగం గంటకు 32 కిమీ మాత్రమే ఉంటుంది. అందువల్ల దీనికి ఎటువంటి బీమా లేదా లైసెన్స్ అవసరం లేదు. 

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌లో 160 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని పేర్కొంది. అదే సమయంలో, సోలార్ ఛార్జింగ్ ఆప్షన్  కూడా ఇందులో అందుబాటులో ఉంది. కంపెనీ డీలక్స్- అల్టిమేట్ అనే రెండు వేరియంట్లలో EVని తీసుకువస్తోంది. ఇది కాకుండా, ఇది సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

Avvenire Tectus ప్రత్యేకతలు.. 
ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు అలాగే, నగరాల్లో పరిమిత వేగంతో ప్రయాణించే వ్యక్తుల కోసం రూపొందించారు. అదే సమయంలో, దాని ప్యాక్ క్యాబిన్ ఎప్పుడైనా, ఎక్కడైనా రైడ్ చేయడానికి వీలు కల్పిస్తుంది.  ఇది ఆల్-వెదర్ ఆన్-రోడ్ - ఆఫ్-రోడ్ మొబిలిటీ స్కూటర్.

ఈ  స్కూటర్‌లో లగేజీని ఉంచడానికి వివిధ రకాల స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ ఆప్షన్స్ ఇచ్చారు.  దీనితో, స్కూటర్ బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. Avvenire Tectus మూడు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది - ఎరుపు, నీలం- నలుపు. ఇది సింగిల్ సీటర్ EV.

Avvenire Tectusఫీచర్లు ఇవే.. 
ఎలక్ట్రిక్ స్కూటర్ డీలక్స్ వేరియంట్ A/C, హీటర్ ఫీచర్లను కలిగి ఉంది. అయితే, టాప్ వేరియంట్ అల్టిమేట్ రివర్స్ ఫంక్షన్, స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, హాట్ అండ్ కోల్డ్ కప్ హోల్డర్స్, స్టీరియో సౌండ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, కీలెస్ ఎంట్రీ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇన్‌బిల్ట్ GPS ట్రాకింగ్, అలారం వాచ్, బ్యాకప్ కెమెరా వంటి ఫీచర్లతో ఫుల్ థ్రోటిల్‌తో వస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, ట్రికిల్ సోలార్ ఛార్జింగ్, రెండు గంటల ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉన్నాయి.

Also Read: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు.. అక్కడ భారీగా ఉద్యోగాలు పోతాయి!

ఆల్-వీల్ డ్రైవ్‌తో 160కిమీల పరిధి వరకు 
ఈ ఇ-స్కూటర్ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సెటప్‌తో 2kW డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌లను కలిగి ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 32 కి.మీ. ఎలక్ట్రిక్ మోటార్‌కు శక్తినివ్వడానికి, డీలక్స్ వేరియంట్‌లో 2.4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్- అల్టిమేట్ వేరియంట్‌లో 5.4kWh అందుబాటులో ఉంది. ఈవీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.

ఇంతకీ ధర ఎంతంటే.. 
ఎంట్రీ-లెవల్ టెక్టస్  డీలక్స్ వేరియంట్ ధర $6,995 (సుమారు రూ. 5.79 లక్షలు) అలాగే టాప్ వేరియంట్ టెక్టస్ అల్టిమేట్ ధర $8,999 (సుమారు రూ. 7.45 లక్షలు) కంపెనీ టెక్ట్స్ బుకింగ్ ప్రారంభించింది. కొనుగోలుదారులు $100 (సుమారు రూ. 8284) టోకెన్ మనీ చెల్లించి అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ-స్కూటర్ డెలివరీ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

#automobile #e-scooter
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe