/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/tdp-8-1-jpg.webp)
Avanigadda TDP: ఏపీలో ఎన్నికల వేళ కృష్ణా జిల్లా అవనిగడ్డ టీడీపీలో తిరుగుబాటు కనిపిస్తోంది. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ ఇంటి దగ్గర ఆందోళన చేపట్టారు. టికెట్ బుద్ధప్రసాద్‌కే కేటాయించాలని తెలుగు తమ్ముళ్ల వాపోతున్నారు. లేదంటూ పార్టీకి రాజీనామా చేయడానికి సైతం వెనకడుగు వేయమని తేల్చి చెబుతున్నారు. ఐదేళ్లు కష్టపడి పోరాటం చేస్తే చివరి నిమిషంలో వేరొకరికి సీటు ఇస్తారా అని మండిపడుతున్నారు.