• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్

Shiva K

Chandrababu Custody: చంద్రబాబుకు సీఐడీ 15 ప్రశ్నలు.. సమాధానం చెప్పేనా?

Published on September 23, 2023 12:09 pm by Shiva K

CID 15 Questions to Chandrababu Naidu: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రెండు కస్టడీలో భాగంగా తొలి రోజు ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న క్వశ్చనైర్ ప్రకారం.. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. ఉదయం 9.30 గంటలకే రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ అధికారుల బృందం.. జైలు కాన్ఫరెన్స్ హాల్‌లో చంద్రబాబును విచారిస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో తమ ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కీలకంగా 15 ప్రశ్నలను సీఐడీ అధికారులు చంద్రబాబుకు సంధించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 120 ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని తెలుస్తున్నా.. అందులో ఈ 15 ప్రశ్నలు అత్యంత కీలకం అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరి చంద్రబాబు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతారా? లేక సమాధానాలు దాటవేస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

సీఐడీ అధికారులు చంద్రబాబును అడగనున్న అత్యంత ముఖ్యమైన 15 ప్రశ్నలు ఇవే..?!

1.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో మీ పాత్ర ఏంటి?

2.జీవోకు, ఒప్పందానికి ఎందుకు తేడా ఉంది?

3.కేబినెట్‌ ఆమోదం లేకుండా నిధుల్ని ఎందుకు విడుదల చేశారు?

4.13 చోట్ల ఉన్న సంతకం మీదేనా?

5.మీ పీఏ ఎందుకు పరారీలో ఉన్నాడు?

6.షెల్‌ కంపెనీల ఏర్పాటు వెనుక మీ పాత్ర ఏంటి?

7.నోట్‌ ఫైల్స్‌ ఎలా మాయమయ్యాయి ?

8.2018లో ఐటీ మీకు లేఖ రాస్తే ఎందుకు దాచారు?

9.లోకేష్‌, ఆయన ఫ్రెండ్‌ కిలారు రాజేష్‌ పాత్ర ఏంటి?

10.అధికారులు అభ్యంతరం చెప్పినా నిధులెలా ఇచ్చారు?

11.రూ.241 కోట్ల నిధులను ఏం చేశారు?

12.నిధుల కోసం ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చారా ?

13.సబ్‌ కాంట్రాక్టులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?

14.గంటా సుబ్బారావుకు, లక్ష్మీనారాయణ కంపెనీలకు నిధులు మళ్లాయా..?

15.షెల్‌ కంపెనీల ద్వారా నిధులు ఎవరికి చేరాయి..?

Also Read:

Telangana Elections: మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ.. పోటీలో నిలిచేది ఆయనేనా?

Chandrababu Custody: నేడు చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ అధికారులు..

Bhuma Akhila Arrest: భూమా అఖిల ప్రియ అరెస్ట్.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్

Hyderabad: భూవివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై కేసు నమోదు..

Published on September 23, 2023 11:24 am by Shiva K

Hyderabad News: హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ భూ వివాదానికి సంబంధించి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలపై నార్సింగి పోలీస్‌ ఠాణాలో కేసు నమోదైంది. వీరిద్దరితోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది..?

కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై పెట్టుబడిదారులు, డెవలపర్‌ మధ్య వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించుకోకుండా డెవలపర్‌ నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఖాళీ చేయించారని డెవలపర్‌ ప్రతినిధి గుండు శ్రవణ్‌ గురువారం రాత్రి ఫిర్యాదు చేయగా.. అదేరోజు పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై ఐపీసీ 447, 427 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

https://rtvlive.com/wp-content/uploads/2023/09/WhatsApp-Video-2023-09-23-at-10.53.55-AM.mp4

గోల్డ్‌ఫిష్‌ సంస్థతో ఎమ్మెల్సీ వెంకట్రామ్‌రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం..

కోకాపేటలోని సర్వేనంబరు 85లోని స్థలాన్ని గోల్డ్ ఫిష్‌ అడోబ్‌ సంస్థ కొద్ది నెలల నుంచి అభివృద్ధి చేస్తోంది. ‘‘గోల్డ్‌ఫిష్‌ సంస్థతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతోంది. గురువారం ఉదయం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 60 మందికిపైగా కోకాపేటలోని స్థలానికి వచ్చారు. గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీ అనుచరులు కూలీల తట్టా, బుట్టా బయటకు విసిరేయడమే కాకుండా గర్భిణులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ లోపు సమాచారం అందుకున్న నేను అక్కడికి వెళ్లగా.. నాపైనా దాడి చేశారు. డీసీఎం వాహనాలను తీసుకువచ్చి కూలీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. కాంటినెంటల్‌ ఆసుపత్రి వద్ద కూలీలను వదిలేసి మరోసారి అక్కడికి వెళితే అంతేనంటూ హెచ్చరించి వెళ్లిపోయారు’’ అని ఫిర్యాదులో గోల్డ్ ఫిష్‌ అడోబ్‌ సంస్థ ప్రతినిధి గుండు శ్రవణ్‌ పేర్కొన్నారు.

https://rtvlive.com/wp-content/uploads/2023/09/WhatsApp-Video-2023-09-23-at-10.53.54-AM-1.mp4

Also Read:

Telangana Elections: మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ.. పోటీలో నిలిచేది ఆయనేనా?

Chandrababu Custody: నేడు చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ అధికారులు..

Bhuma Akhila Arrest: భూమా అఖిల ప్రియ అరెస్ట్.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్

Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులో నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్న నటుడు నవదీప్..

Published on September 23, 2023 10:14 am by Shiva K

Actor Navdeep To Attend the Police Investigation: మాదాపూర్ డ్రగ్స్ కేసులో నేడు కీలక పరిణామాం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నవదీప్ ఇవాళ అంటే శనివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నాడు. HNEW కార్యాలయంలో 11గంటలకు విచారణకు హాజరు కావాలంటూ నవదీప్‌కి 41A కింద నోటీసులు జారీ చేశారు నార్కోటిక్ పోలీసులు. కాగా, మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఏ29 నిందతుడిగా ఉన్నాడు. డ్రగ్స్ సప్లయర్ రామచందర్‌కు, నవదీప్ కు ఉన్న సంబంధాలపై నేటి విచారణలో ఆరా తీయనున్నారు నార్కోటిక్ పోలీసులు. హీరో నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్లు నార్కోటిక్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు జారీ చేసిన నోటీసుల్లో ఉన్న కీలక అంశాలు ఇవే..

డ్రగ్స్ కేసులో సప్లయర్ రామచందర్ పట్టుబడిన తరువాత హీరో నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దాంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో తన పేరును సీపీ ప్రకటించడమే ఆలస్యం.. నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు ధర్మాసనం.. 41ఏ సీఆర్‌పీసీ కింద విచారణకు హాజరు కావాలని నవదీప్‌కు సూచించింది హైకోర్టు. కాగా, మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌లో రామచంద్ వద్ద హీరో నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నార్కోటిక్ పోలీసులు సరైన ఆధారాలను కోర్టుకు చూపించడంతో.. విచారణకు హాజరు కావాలని నవదీప్‌ను ఆదేశించింది కోర్టు.

హీరో నవదీప్ కేసులో బయటపడిన షాకింగ్ నిజాల్.. మీడియోలో చూడండి..

Also Read:

Telangana Elections: మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ.. పోటీలో నిలిచేది ఆయనేనా?

Chandrababu Custody: నేడు చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ అధికారులు..

Bhuma Akhila Arrest: భూమా అఖిల ప్రియ అరెస్ట్.. నంద్యాలలో టెన్షన్ టెన్షన్

Telangana Elections: మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ.. పోటీలో నిలిచేది ఆయనేనా?

Published on September 23, 2023 9:37 am by Shiva K

BRS Focus on Malkajgiri: ఎట్టకేలకు ఊగిసలాటకు తెరపడింది.. ముందునుంచీ అనుకుంటున్నట్లుగానే ఆయన పార్టీని వీడారు.. తన రాజీనామా లేఖను గులాబీ బాస్‌కు పంపించారు. ఆయనెవరో కాదు.. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. తన కొడుక్కి ఎమ్మెల్యే సీటు కోసం బీఆర్ఎస్‌ను వీడిన ఆయన.. రేపో మాపో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేదే ఆసక్తికరంగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్‌ లిస్ట్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు పేరును ఖరారు చేశారు. అయితే, తన కొడుక్కి మెదక్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలంటూ ఆయన కోరగా.. అధినేత అంగీకరించలేదు. దాంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న మైనంపల్లి.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

మైనంపల్లి రాజీనామాతో కొత్త అభ్యర్థిపై ఫోకస్..

అయితే, మైనంపల్లి హనుమంతరావు పార్టీకి రాజీనామా చేయడంతో మల్కాజిగిరి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం. అయితే, దాదాపు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికే ఈ సీటు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రచారంలో బీఆర్ఎస్ అధికార ప్రతినిథి క్రిశాంక్, మండలి రాధాకృష్ణా యాదవ్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. రాధాకృష్ణ యాదవ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీప బంధువు. దాంతో ఆయనకు టికెట్ కేటాయించడంపైనా చర్చ జరుగుతోంది. ఈయన గతంలో టీడీపీలో చాలా కాలం పని చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థిని లాగే ప్లాన్..

ఇదే సమయంలో మల్కాజిగిరి కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న నందికంటి శ్రీధర్‌ను తమవైపు లాగేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ప్రస్తుతం మల్కాజిగిరి ఇన్‌ఛార్జి గా ఉన్న శ్రీధర్.. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, మైనంపల్లి రాకతో ఆయనకు టికెట్ దక్కడం దాదాపు అసాధ్యమే చెప్పాలి. అందుకే.. శ్రీధర్ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని తమవైపు లాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ.

అధినేత హామీలు..

బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లిని సద్దుమణిచేందుకు పార్టీ అధినేత అసంతృప్త నేతలకు హామీలు ఇస్తున్నారు. మల్లారెడ్డి అల్లు రాజశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. జనగామ ఎమ్మెల్యే టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ స్థానంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తామని అధినేత హామీ ఇచ్చారట. ఇక స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని హామీ ఇచ్చారట.

Also Read:

Chandrababu Arrest: చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది.. నారా లోకేష్ సంచలన ఆరోపణలు..

canada issue:కెనడియన్లకు భారతీయ వీసాలు నిలిపివేత…

Chandrababu Custody: నేడు చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ అధికారులు..

Published on September 23, 2023 8:00 am by Shiva K

CID Officials to Question Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబును(Chandrababu) సీఐడీ అధికారులు(CID Officers) తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి ఆయనను విచారించనున్నారు. చంద్రబాబును విచారించేందుకు విజయవాడ నుంచి రాజమండ్రికి బయలుదేరారు సీఐడీ అధికారులు. 12 మందితో కూడిన బృందం.. చంద్రబాబును విచారించనుంది. ఈ బృందంలోని అధికారుల పేర్లను సీఐడీ తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు సమర్పించారు. ఈ బృందంలో 9 మంది సీఐడీ అధికారులు, సిబ్బందితో పాటు ఒకక వీడియో గ్రాఫర్, ఇద్దరు మధ్యవర్తులు ఉన్నారు. వారి పేర్లతో కూడిన జాబితాను సీఐడీ తరపు న్యాయవాదులు నిన్న ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. ఆర్థిక నేరాల విభాగం-2 డీఎస్పీలు ఎం. ధనుంజయుడు, వి.విజయ్ భాస్కర్, ఎ. లక్ష్మీనారాయణ, ఇన్స్‌పెక్టర్లు ఎన్.ఎల్.వి.మోహన్ కుమార్, వై. రవికుమార్, ఐ. శ్రీనివాసన్, సీహెచ్.సాంబశివరావు, ఏఎస్సై పి. రంగనాయకులు, కానిస్టే బుల్ ఎం.సత్యనారాయణ.. ఈ బృందంలో ఉంటారని సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించారు.

కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును విచారించనున్నారు సీఐడీ అధికారులు. కస్టడీ విచారణకు చంద్రబాబు తరఫున ఇద్దరు లాయర్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును ప్రశ్నించనున్నారు సీఐడీ అధికారులు. విచారణలో భాగంగా ప్రతి గంటకు 5 నిమిషాలు చొప్పున చంద్రబాబుకు బ్రేక్ ఇస్తారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును విచారించేందుకు ప్రశ్నలను సిద్ధం చేశారు సీఐడీ అధికారులు. ఇకపోతే సీఐడీ విచారణ నేపథ్యంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద రెండంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. శుక్రవారం సాయంత్రం నుంచి లోకేష్ క్యాంప్ ఆఫీస్‌కు టీడీపీ ముఖ్య నేతలు చేరుకుంటారు.

Also Read:

Chandrababu Arrest: చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది.. నారా లోకేష్ సంచలన ఆరోపణలు..

canada issue:కెనడియన్లకు భారతీయ వీసాలు నిలిపివేత…

Astro Tips: పొరపాటున కూడా ఈ 4 విగ్రహాలను ఇంట్లో ఉంచకండి.. లేదంటే చాలా కోల్పోతారు..

Published on September 23, 2023 7:39 am by Shiva K

Astrology Tips: హిందూ సంప్రదాయం ప్రకారం.. ప్రతి హిందువు ఇళ్లలో ఒక చిన్న దేవాలయం ఉంటుంది. దేవుడి(Home Temple) కోసం ప్రజల తమ ఇళ్లలో ఒక చిన్నపాటి మందిరాన్ని నిర్మిస్తారు. ఉదయం, సాయంత్రం పూజలు చేస్తూ దేవుళ్లను ఆరాదిస్తారు. ఆ పూజా గృహాలలో వివిధ దేవుళ్ళ, దేవతల చిన్న విగ్రహాలు ప్రతిష్టించడం జరుగుతుంది. ఇంట్లో దేవతలను నెలకొల్పి.. పూజలు చేసే ఇళ్లలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఆ కుటుంబంలో సంపద, శ్రేయస్సుతో సహా అన్ని ఆనందాలు వస్తాయి. అయితే, ఇంట్లో ఏర్పాటు చేసే గుడిలో ఎప్పుడూ ప్రతిష్టించకూడని విగ్రహాలు కొన్ని ఉన్నాయి. ఆ విగ్రహాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఆ దేవుళ్లను, దేవతలను బయట దేవాలయాల్లో మాత్రమే పూజించాలి. లేదంటే.. వితం కష్టాల్లో కూరుకుపోతుందని వేద పండితులు చెబుతున్నారు. మరి ఏ దేవుళ్ల విగ్రహాలను ఇంట్లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

రాహు-కేతు..

వేద గ్రంధాలలో, రాహు-కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. మత గ్రంధాల ప్రకారం.. రాహు కేతు అమృతం తాగడం ద్వారా అమరుడయ్యాడట. దాంతో అతను రాక్షసుడిలా మారి.. అరాచకాలకు పాల్పడ్డాడు. అతని దురాగతాలు పెరిగిపోయాయి. దాంతో అతన్ని చేయడానికి శ్రీ మహా విష్ణువే నేరుగా రంగంలోకి దిగాడట. విష్ణువు అతని తలన నరికేయగా.. రెండు భాగాలుగా విడిపోయింది. దాంతో అతని తల రాహువు, మొండె కేతువుగా పిలవడం జరిగింది. ఈ రాహు-కేతు విగ్రహాన్ని ఇంట్లో ఎప్పుడూ ప్రతిష్టించొద్దు.

మహాకాళి..

మహాకాళిని తల్లి దుర్గ, పార్వతి మాతకు మరొక రూపంగా భావిస్తారు. దుష్టులను సంహరించడానికి భూమిపైకి వచ్చిన దుర్గా స్వరూపిణి. ఇంట్లో మహంకాళి విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి వస్తుందని అంటుంటారు. ఇంట్లో గొడవలు, తగాదాలు ఎక్కువవుతాయట. అందుకే ఇంట్లో కాళీ విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని, కేవలం గుడిలో మాత్రమే పూజించాలని చెబుతున్నారు.

నరసింహ స్వామి..

మత గ్రంథాల ప్రకారం.. దుష్ట హిరణ్యకష్యపుని చంపడానికి విష్ణువు భూమిపై నరసింహునిగా అవతరించాడు. మెడ వరకు మనిషి శరీరం, తల మాత్రం సింహం అవతారంలో వచ్చిన నరసింహుడు.. హిరణ్యకష్యపుడిని అంతమొందిస్తాడు. అలా హిరణ్యకష్యపుని రక్తాన్ని కూడా తాగుతాడు. ఈ ఉగ్ర నరసింహ అవతారంతో కూడిన విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టంచ కూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో, కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు పండితులు.

శని దేవ్..

శని దేవుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు. ఆయన ఎవరిపైనా పగ పెంచుకోరు. వ్యక్తి కర్మలను బట్టి తగిన ఫలితాలను ఇస్తారు. శని ఎవరినీ ఇబ్బంది పెట్టనప్పటికీ, ఎవరైనా తప్పు చేస్తే.. శని క్రూరమైన దృష్టి అతన్ని నాశనం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు అని విశ్వాసం. అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని దేవుడి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకురావడం నిషిద్ధం.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత గ్రంథాల ఆధారంగా, ప్రజల సాధారణ ఆసక్తుల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆర్టీవీ ధృవీకరించడం లేదు.

Also Read:

Chandrababu Arrest: చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది.. నారా లోకేష్ సంచలన ఆరోపణలు..

canada issue:కెనడియన్లకు భారతీయ వీసాలు నిలిపివేత…

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Interim pages omitted …
  • Go to page 28
  • Go to Next Page »

Primary Sidebar

INDvsAUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం

INDvsAUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం

Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

Rajaiah: మరో బాంబ్ పేల్చిన రాజయ్య.. కడియంకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు

Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

Chandrababu: అక్టోబర్ 5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?

Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?

IND vs AUS :  వర్షం కారణంగా  మ్యాచ్‎కు అంతరాయం...నిలిచిపోయిన ఆట..!!

IND vs AUS : వర్షం కారణంగా మ్యాచ్‎కు అంతరాయం…నిలిచిపోయిన ఆట..!!

PM Modi Mann ki Baat : చంద్రయాన్-3, జీ-20తో ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!!

PM Modi Mann ki Baat : చంద్రయాన్-3, జీ-20తో ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!!

VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!

VandeBharat Express : తెలుగు రాష్ట్రాలకు మోదీ కానుక..ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని..!!

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..!!

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న డీజిల్, పెట్రోల్ ధరలు..!!

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online