• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

RTV NEWS NETWORK

RTV NEWS NETWORK

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్

BalaMurali Krishna

Iraq Fire Accident: ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 100 మందికి పైగా మృతి

Published on September 27, 2023 7:02 pm by BalaMurali Krishna

Iraq Fire Accident: ఇరాక్‌ దేశంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మందికి పైగా మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. కాసేపట్లో పెళ్లి జరగనుంది. దీంతో అప్పటివరకు ఆ హాల్‌ అంతా సందడిగా ఉంది. అంతా ఈ వేడుకలో మునిగిపోయారు. కానీ అంతలోనే ఊహించని ప్రమాదం. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఏం జరుగుతుందో అర్థం కాక వధూవరులతో పాటు కుటుంబసభ్యులు, బంధువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఉత్తర నినేవే ప్రావిన్స్‌లోని హమ్దానియా ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

రాత్రి 10.45కు ఒక్కసారిగా పెళ్లి మండపంలో మంటలు చెలరేగాయి. కాపాడాలంటూ ఆర్తనాదాలు పెడుతూ అక్కడున్న వారంతా బయటకు పరుగులు పెట్టారు. అప్పటికే మంటలు చుట్టుముట్టేయడంతో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వెడ్డింగ్‌ హాల్‌లో వెయ్యి మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఎగసిపడిన అగ్నికీలలకు వెడ్డింగ్‌ హాల్‌ మొత్తం బూడిదగా మారిపోయింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనతో ఆ ప్రాంతమంతా భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. వివాహ వేడుకలో కాల్చిన బాణాసంచా కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక అంచనాకొచ్చారు స్థానిక అధికారులు. ప్రధానమంత్రి మహమ్మద్ షియా అల్ సుడానీ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వివాహ సమయంలో బాణసంచా పేల్చటంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఫంక్షన్ హాల్‌లో సామాగ్రికి వేగంగా మంటలు అంటుకోవటంతో వేడుకలో పాల్గొన్నవారు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది.. అగ్ని ప్రమాదం సమాచారం అందగానే వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. అక్కడికి అంబులెన్స్‌లు పంపించి క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని వెల్లడించారు.

ఇదది కూడా చదవండి: అవును అతను మోసం చేశాడు…తేల్చిచెప్పిన న్యూయార్క్ జడ్జ్

MODI: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు.. తాజా షెడ్యూల్ ఇదే..

Published on September 27, 2023 5:59 pm by BalaMurali Krishna

MODI: మరో రెండు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అధికార, విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్ర నేతలందరూ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ పెద్దలు తెలంగాణలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా మోదీ-షా ద్వయం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వరుస పర్యటనలు చేసి క్యాడర్‌లో జోష్ నింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రెండు సార్లు రాష్ట్ర పర్యటనకు రాగా.. తాజా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1న మహబూబ్ నగర్ జిల్లాకు రానున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే ఖారారైంది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు.

తాజా షెడ్యూల్ ఇదే..

ముందస్తు షెడ్యూల్ ప్రకారం మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు బేగంపేట బదులు శంషాబాద్ విమాశ్రయానికి రానున్నారు. అక్టోబర్ 1 మధ్యాహ్నం 1:30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మోదీ ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి 1:35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌ నగర్‌కు బయలుదేరనున్నారు. 2:10 గంటలకు మహబూబ్‌ నగర్ హెలిపాడ్ వద్దకు చేరుకుని 2:15 గంటల నుంచి 2:50 గంటల వరకు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం 3 గంటల నుంచి 4 గంటల వరకు పార్టీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రసంగం తర్వాత 4:10 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. 4:50 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీ తిరుగు పయనమవుతారు. తెలంగాణ బీజేపీ శ్రేణులు  మోదీ పర్యటనపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆయన పర్యటనతో బీజేపీలో మళ్లీ జోష్ పెరుగుతుందన్న భావన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.

కేసీఆర్ స్వాగతం పలుకుతారా..?

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రధాని ఏం మాట్లాడుతారు? తెలంగాణకు ఏమైనా హామీలు ఇస్తారా? అధికార పార్టీపై ఎలాంటి విమర్శలు చేస్తారు? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రధాని రాష్ట్రాల పర్యటనకు వచ్చిన సమయంలో సాధారణంగా సీఎం స్వాగతం పలుకుతుంటారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇటీవల ప్రధానికి స్వాగతం పలకడానికి వెళ్లడం లేదు. ఆయన స్థానంలో ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఎంకు స్వాగతం పలుకుతున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. హస్తం పార్టీలోకి ఆ ఐదుగురు కీలక నేతలు?

 

Ind vs Aus: దుమ్మురేపిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ లక్ష్యం 353 పరుగులు

Published on September 27, 2023 5:33 pm by BalaMurali Krishna

Ind vs Aus: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కంగారు జట్టు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ 74 పరుగులతో రాణించాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లబుషేన్ ఓ వైపు వికెట్లు ప‌డుతున్నప్పటికీ 72 పరుగులతో చివర్లో దుమ్మురేపాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్ల తీయగా.. కుల్దీప్ యాద‌వ్‌ రెండు, ప్రసిద్ద్ కృష్ణ, మ‌హ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ తీశారు.

భారత తుది జ‌ట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(వికెట్ కీప‌ర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంఘా, జోష్ హేజిల్‌వుడ్

 

Innings break!

Australia post 352/7 in the first innings!

Over to our batters 💪

Scorecard ▶️ https://t.co/H0AW9UXI5Y#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/FBH2ZdnEF6

— BCCI (@BCCI) September 27, 2023

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఇండియా.. సిరీస్ సొంతం చేసుకుంది. మొదటి రెండు మ్యాచులకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచులో జట్టులోకి వచ్చారు.  ఇక రెండు మ్యాచుల్లో అద‌ర‌గొట్టిన సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ప‌క్క‌న బెట్టి అత‌డి స్థానంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు చోటు ఇచ్చారు.

Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

Published on September 27, 2023 4:31 pm by BalaMurali Krishna

Chandrababu: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 29 మధ్యాహ్నం 2.15గంటలకు విచారణను వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

మరోవైపు ఇదే కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన మెమోలో లోకేష్‌ను ఏ14గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ కూడా ఈనెల 29న జరిగే అవకాశం ఉంది.

ఇక చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. తొలుత జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ వెంకట నారాయణ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రాగా.. నాట్ బిఫోర్ మీ అని విచారణకు న్యాయమూర్తి భట్టి విముఖత వ్యక్తం చేశారు. దీంతో క్వాష్‌ పిటిషన్‌ను సీజేఐ చంద్రచూడ్ ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా మెన్షన్ చేశారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని తమ మొదటి అభ్యర్థన అని.. మధ్యంతర బెయిల్ అనేది రెండో అభ్యర్థన అని లూథ్రా తెలిపారు. 17ఏ కేసు మూలాల గురించి చర్చించాల్సిన అంశం ఉందని అభిప్రాయపడ్డారు. జడ్‌ క్యాటరిగీ, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా అని వాదించారు. లూథ్రా వాదనలు విన్న సీజేఐ తదుపరి విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేశారు.

 

2018 Movie: ఆస్కార్‌కు భారత్ తరపున అధికారికంగా ఎంపికైన మలయాళం మూవీ

Published on September 27, 2023 4:20 pm by BalaMurali Krishna

2018 Movie: ఆస్కార్ అవార్డు కోసం ఈ ఏడాది అధికారికంగా ఒకే ఒక్క చిత్రం భారత్ తరపున ఎంపికైంది. గతేడాది ‘ఆర్ఆర్‌ఆర్’ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో యావత్ ప్రపంచం భారత సినిమాల వైపు చూడటం మొదలుపెట్టింది. ప్రపంచంలో ఏ మూలన చూసినా నాటు నాటు ఎంతలా మార్మోగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు 2024 ఆస్కార్ అవార్డుకు ఏ భారత చిత్రం పోటీ పడనుందోననే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. అయితే మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ‘2018-ఎవ్రీ వన్ ఈజ్ హీరో’ సినిమాను అధికారికంగా ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ ఫిలిం’ కేటగిరి కింద ఆస్కార్‌ అవార్డుకు పంపుతున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

 

Malayalam film “2018- Everyone is a Hero” India’s official entry for Oscars 2024: Film Federation of India

— Press Trust of India (@PTI_News) September 27, 2023

2018లో కేరళను ముంచెత్తిన వరదల నేపథ్యంలో ఈ సినిమాను ఎంతో సృజన్మాతకంగా తెరకెక్కించారు. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాధికారులతో పాటు, ప్రజలు కూడా స్పందించి తోటి ప్రజలను ఎలా కాపాడుకున్నారనే కథాంశంతో ఈ చిత్రం నిర్మితమైంది. అభిమానులతో పాటు విమర్శకుల ప్రసంశలు అందుకున్న ఈ సినిమా వసూళ్లలోనూ రికార్డు సాధించింది. ఈ చిత్రంలో మలయాళ యువ కథానాయకుడు టోవినో థామస్ ఓ కీలక పాత్రలో నటించారు. ఆకాశమే హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళి, లాల్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, తన్వి రామ్, కున్‌చకో బోబన్, అజు వర్గీస్, నరైన్, కలైయారసన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మే 25న కేరళలో విడుదలైన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి జాతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది. వసూళ్ల ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాను మే 26న తెలుగులో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు విడుదల చేశారు. తెలుగులోనూ మంచి హిట్ అందుకుంది ఈ చిత్రం.

ఇంతకు ముందు ఆమిర్ ఖాన్ నటించిన ‘లగాన్’ సినిమా అధికారికంగా ఎంపికైనప్పుడు ఆస్కార్ నామినేషన్స్ వరకు నిలిచింది. అయితే అవార్డు మాత్రం అందుకోలేకపోయింది. మళ్లీ ఇప్పుడు 2018 చిత్రాన్ని అధికారికంగా ఆస్కార్ అవార్డు కోసం పంపిస్తున్నారు. తెలుగు సినిమాలు బలగం, దసరా మూవీలు కూడా ఆస్కార్ అవార్డు ఎంపిక కోసం పోటీ పడినా.. చివరకు ఫెడరేషన్ సభ్యులు 2018 మూవీని ఎంపిక చేశారు.

Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

Published on September 27, 2023 2:46 pm by BalaMurali Krishna

టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. తొలుత జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ వెంకట నారాయణ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రాగా.. నాట్ బిఫోర్ మీ అని విచారణకు న్యాయమూర్తి భట్టి విముఖత వ్యక్తం చేశారు. దీంతో క్వాష్‌ పిటిషన్‌ను సీజేఐ చంద్రచూడ్ ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా మెన్షన్ చేశారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని తమ మొదటి అభ్యర్థన అని.. మధ్యంతర బెయిల్ అనేది రెండో అభ్యర్థన అని లూథ్రా తెలిపారు. 17ఏ కేసు మూలాల గురించి చర్చించాల్సిన అంశం ఉందని అభిప్రాయపడ్డారు. జడ్‌ క్యాటరిగీ, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా అని వాదించారు. లూథ్రా వాదనలు విన్న సీజేఐ తదుపరి విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేశారు.

 

#BREAKING Supreme Court says it will not restrain the trial judge from dealing with the application seeking police custody of #ChandrababuNaidu.

Court lists Chandrababu Naidu’s plea to quash FIR on October 3. https://t.co/ub2RXoBJGw

— Live Law (@LiveLawIndia) September 27, 2023

స్కిల్ డెవల్‌ప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో గత శనివారం స్పెషల్ లీవ్ పిటీషన్‌ను లాయర్ గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

సీమెన్స్‌కు నిధుల విడుదలకు సిఫారసులతో నిధుల దుర్వినియోగం జరిగిందని.. దీనిపై నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా సోమవారం సీజేఐ చంద్రచూడ్ వద్ద ప్రస్తావించారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరగాల్సి ఉండగా.. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం భేటీ అయిన నేపథ్యంలో మిగతా కేసులను రిజిస్ట్రీ లిస్ట్ చేయలేదు. దీంతో ఇవాళ విచారణకు వచ్చింది.

 

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Interim pages omitted …
  • Go to page 98
  • Go to Next Page »

Primary Sidebar

Bandaru Satyanarayana: రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసు.. మాజీ మంత్రి బండారుకు బెయిల్‌!

Bandaru Satyanarayana: రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసు.. మాజీ మంత్రి బండారుకు బెయిల్‌!

World cup 2023: క్రికెట్ అభిమానుల కష్టాలు.. VPN ఆన్‌ చేసుకోవాల్సి వస్తోంది భయ్యా!

World cup 2023: క్రికెట్ అభిమానుల కష్టాలు.. VPN ఆన్‌ చేసుకోవాల్సి వస్తోంది భయ్యా!

Sitting Problems: ఎక్కువగా కూర్చోవడం వల్ల ఇన్ని సమస్యలా? ఇది సిగరేట్‌ కంటే డేంజర్ బాసూ!

Sitting Problems: ఎక్కువగా కూర్చోవడం వల్ల ఇన్ని సమస్యలా? ఇది సిగరేట్‌ కంటే డేంజర్ బాసూ!

Telangana Politics: ఆ ముగ్గురు మళ్లీ మిస్.. కాంగ్రెస్‌లోకి జంపేనా?

Telangana Politics: ఆ ముగ్గురు మళ్లీ మిస్.. కాంగ్రెస్‌లోకి జంపేనా?

World Animal Day 2023: అంతర్జాతీయ జంతు దినోత్సవం.. భూమి మనుషులది మాత్రమే కాదు బాసూ..!

World Animal Day 2023: అంతర్జాతీయ జంతు దినోత్సవం.. భూమి మనుషులది మాత్రమే కాదు బాసూ..!

Bandaru Vs Roja: బండారు బూతులపై రోజా కంట తడి..వెక్కి వెక్కి ఏడ్చిన మంత్రి!

Bandaru Vs Roja: బండారు బూతులపై రోజా కంట తడి..వెక్కి వెక్కి ఏడ్చిన మంత్రి!

World cup 2023: వరల్డ్‌ కప్‌ అంటే ఈ ఆటగాడికి పూనకాలు పక్కా భయ్యా.. ఆ లెక్కలు చూస్తే షాక్‌ అవుతారు!

World cup 2023: వరల్డ్‌ కప్‌ అంటే ఈ ఆటగాడికి పూనకాలు పక్కా భయ్యా.. ఆ లెక్కలు చూస్తే షాక్‌ అవుతారు!

Janasena BJP alliance: జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు.. పవన్‌ క్యాడర్‌లో టెన్షన్!

Janasena BJP alliance: జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు.. పవన్‌ క్యాడర్‌లో టెన్షన్!

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online