కుక్క తప్ప అన్నీ ఉన్నాయి.. ఇది అచ్చంగా ఆ సినిమానే బాసూ...!!!

2000వ సంవత్సరంలో వచ్చిన క్యాస్ట్ అవే ( caste away)సినిమా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ సినిమా ఆస్కార్ ను కూడా గెలుచుకుంది. ఇది అమెరికన్ అడ్వెంచర్ డ్రామా చిత్రం. రాబర్ట్ జెమెకిస్ డైరెక్షన్ లో ఈ సినిమాను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. దక్షిణ పసిఫిక్ లో విమానం కూలిపోయిన తర్వాత జనావాసాలు లేని ద్వీపంలో చిక్కుకున్న ఫెడెక్స్ ఉద్యోగిగా టామ్ హాంక్స్ ఎంతో అద్భుతంగా నటించి అందర్నీ మెప్పించారు. అయితే ఇప్పుడా సినిమా గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారనే కదా మీ డౌట్. అక్కడే వస్తున్నాం.

కుక్క తప్ప అన్నీ ఉన్నాయి.. ఇది అచ్చంగా ఆ సినిమానే బాసూ...!!!
New Update

అచ్చం క్యాస్ట్ అవే సినిమా మాదిరిగానే నిజ జీవితంలోనూ ఆస్ట్రేలియాకు చెందిన నావికుడు రెండు నెలలపాటు పసిఫిక్ సముద్రంలో తన పెంపుడు కుక్కతో కలిసి జీవనర్మణ పోరాటం సాగించారు. క్యాస్ట్ అవే సినిమాలో హీరో రెండు సంవత్సరాలు..జనవాసాలు లేని ద్వీపంలో చిక్కుకుపోతాడు. ఇక్కడ ఈ ఆస్ట్రేలియన్ నావికుడితోపాటు కుక్క కూడా ఉంటుంది. రెండింటికి ఒక కుక్క మాత్రమే తేడా. అచ్చం క్యాస్ట్ అవే సినిమాలో హీరో ఎలాంటి కష్టాలు పడ్డాడో...ఇక్కడ ఈ ఆస్ట్రేలియన్ నావికుడు కూడా అలాంటి కష్టాలనే ఎదుర్కొన్నాడు. రెండు నెలలపాటు పచ్చి చేపలు తింటూ వర్షపు నీరు తాగుతూ కాలం వెళ్లదీశాడు.

publive-image

అసలు విషయం ఏంటంటే..సిడ్నీలో ఉండే 51ఏళ్ల టీమ్ షాడాక్..తన పెంపుడు కుక్కను తీసుకుని బోటులో మెక్సికో నుంచి ఫ్రెంచ్ పాలినిసీయూ ద్వీపానికి ఏప్రిల్లో బయలుదేరాడు. ప్రయాణం షురూ అయిన కొన్ని వారాల తర్వాత తుఫాన్ కారణంగా బోటు దెబ్బతిన్నది. దీంతో ఉత్తర పసిఫిక్ సముద్రంలో తన పెంపుడు కుక్కతోపాటు ఆయనకూడా చిక్కుకున్నాడు. చివరకు రెండు నెలల తర్వాత మెక్సికో తీరంలో వారిని గుర్తించారు. బలహీనంగా బాగా పెరిగిన గడ్డంతో కనిపించాడు టిమ్ షాడాక్.

సముద్రంలో ఉన్న వీరిని ఒక హెలికాఫ్టర్ గుర్తించింది. చేపల వేటకు ఉపయోగించే ట్యూనా అనే ఓడ సాయంతో వారిని కాపాడారు. టిమ్ షాడాక్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే తాను రెండు నెలలు ఎంతో కష్టపడ్డానని తెలిపాడు. తినడానికి ఏం లేదని..పచ్చి చేపలనే తాను ఆహారంగా తీసుకున్నాని చెప్పాడు. తాగేందుకు నీరు లేకపోవడంతో వర్షపు నీరు తాగానని చెప్పాడు. చేపల గాలమే తనను ప్రాణాలతో కాపాడిందని షాడాక్ చెప్పాడు.

#మెక్సికో
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe