అచ్చం క్యాస్ట్ అవే సినిమా మాదిరిగానే నిజ జీవితంలోనూ ఆస్ట్రేలియాకు చెందిన నావికుడు రెండు నెలలపాటు పసిఫిక్ సముద్రంలో తన పెంపుడు కుక్కతో కలిసి జీవనర్మణ పోరాటం సాగించారు. క్యాస్ట్ అవే సినిమాలో హీరో రెండు సంవత్సరాలు..జనవాసాలు లేని ద్వీపంలో చిక్కుకుపోతాడు. ఇక్కడ ఈ ఆస్ట్రేలియన్ నావికుడితోపాటు కుక్క కూడా ఉంటుంది. రెండింటికి ఒక కుక్క మాత్రమే తేడా. అచ్చం క్యాస్ట్ అవే సినిమాలో హీరో ఎలాంటి కష్టాలు పడ్డాడో…ఇక్కడ ఈ ఆస్ట్రేలియన్ నావికుడు కూడా అలాంటి కష్టాలనే ఎదుర్కొన్నాడు. రెండు నెలలపాటు పచ్చి చేపలు తింటూ వర్షపు నీరు తాగుతూ కాలం వెళ్లదీశాడు.
పూర్తిగా చదవండి..కుక్క తప్ప అన్నీ ఉన్నాయి.. ఇది అచ్చంగా ఆ సినిమానే బాసూ…!!!
2000వ సంవత్సరంలో వచ్చిన క్యాస్ట్ అవే ( caste away)సినిమా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ సినిమా ఆస్కార్ ను కూడా గెలుచుకుంది. ఇది అమెరికన్ అడ్వెంచర్ డ్రామా చిత్రం. రాబర్ట్ జెమెకిస్ డైరెక్షన్ లో ఈ సినిమాను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. దక్షిణ పసిఫిక్ లో విమానం కూలిపోయిన తర్వాత జనావాసాలు లేని ద్వీపంలో చిక్కుకున్న ఫెడెక్స్ ఉద్యోగిగా టామ్ హాంక్స్ ఎంతో అద్భుతంగా నటించి అందర్నీ మెప్పించారు. అయితే ఇప్పుడా సినిమా గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారనే కదా మీ డౌట్. అక్కడే వస్తున్నాం.

Translate this News: