/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/auli-8385285.jpg)
Auli Uttarakhand: సమ్మర్ వచ్చిందంటే అందరు పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తారు. అయితే సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఉత్తరాఖండ్‌లోని ' ఔలి' అనే ఆకర్షణీయమైన హిల్ స్టేషన్ బెస్ట్ అప్షన్. ప్రకృతి అందాలు, మంచుతో కప్పబడిన కొండల కారణంగా దీనిని 'స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. ముఖ్యంగా హనీమూన్ కపుల్స్ ఔలి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా చెబుతారు. ఉత్తరాఖండ్‌లోని కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..
ఔలీ రోప్‌వే
ఔలి రోప్‌వే ఔలిలో ప్రధాన ఆకర్షణ. ఇక్కడ నుంచి హిమాలయాల అందమైన దృశ్యాలు చూడవచ్చు. ఇది గుల్‌మార్గ్ తర్వాత ఆసియాలో ఎత్తైన, పొడవైన రోప్‌వే. ఔలీ కేబుల్ కార్ 4.15 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-88-5.jpg)
నందా దేవి నేషనల్ పార్క్
నందా దేవి నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న మనోహరమైన ప్రకృతి దృశ్యం. ఇది 1982లో స్థాపించబడింది. నందా దేవి నేషనల్ పార్క్ 12 జనవరి 1987న ఉనికిలోకి వచ్చింది. 1992లో ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. ఈ పార్క్ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు పర్యాటకుల కోసం తెరవబడుతుంది.
ఔలి సరస్సు
ఔలి సరస్సు చాలా ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మిత సరస్సులలో ఒకటి. తక్కువ స్నో ఫాల్ ఉన్న నెలల్లో స్కై స్లోప్స్ పై కృత్రిమ మంచును అందించడానికి ఈ సరస్సును ప్రభుత్వం రూపొందించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-89-4.jpg)
ఫ్లవర్ వ్యాలీ
ఔలిలో, మీరు మీ భాగస్వామితో రొమాంటిక్ క్షణాలను గడపడానికి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కి వెళ్లవచ్చు. ఉత్తరాఖండ్‌లోని గోవింద్ ఘాట్ నుంచి కొన్ని కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత, ఫ్లవర్ వ్యాలీ అందమైన దృశ్యం జంటలకు రొమాంటిక్ క్షణాలను అందిస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-91-4.jpg)
నందప్రయాగ
5 ప్రయాగలలో, మూడు ప్రయాగలు (విష్ణు ప్రయాగ, నందప్రయాగ కర్ణప్రయాగ) ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్నాయి. వీటికి వారి స్వంత పౌరాణిక విశ్వాసాలు ఉన్నాయి. అలకనంద, నందాకినీ నదుల సంగమం అయిన నందప్రయాగ ఈ ప్రయాగలలో ఒకటి. చుట్టూ అందమైన పర్వతాలు, ప్రశాంతమైన, స్వచ్ఛమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది.
Also Read: Mamitha Baiju: బంపరాఫర్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. హీరో ఎవరో తెలుసా..? - Rtvlive.com
Follow Us