Petrol Tank: పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 25 మంది మృతి!

హైతీలో ఇంధన ట్యాంకర్‌ పేలడంతో 25 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ట్యాంకర్‌ అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.

New Update
petrol tank

Petrol Tank: హైతీలో ఇంధన ట్యాంకర్‌ పేలడంతో 25 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పెట్రోల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు వివరించారు. 

హైతీ తాత్కాలిక ప్రధాని గ్యారీ కొనిల్‌ ఘటనా స్థలిని సందర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఇది భయంకరమైన ఘటన. ఘటనలో తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను రక్షించడానికి అత్యవసర బృందాలు పని చేస్తున్నాయి అని తెలిపారు.

హైతీ రాజధాని పోర్ట్‌ ఓ ప్రిన్స్‌ ప్రస్తుతం క్రిమినల్‌ గ్యాంగుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే. ముఠాల వ్యాప్తితో దేశంలో స్థానికులు ఇళ్లను వదిలి వెళ్లిపోవడంతో పాటు ఆకలి సంక్షోభం, లైంగిక హింస వంటివి తీవ్రంగా పెరిగాయి. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సంగతి తెలిసిందే. సాయుధ బలగాల ఒత్తిడితో దేశ ప్రధాని అరియల్‌ హెన్నీ రాజీనామా చేయడంతో గ్యారీ కొనల్ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తున్నారు.

Also Read: ప్రధాని అవుతారా..అయితే మేం మద్దతిస్తాం!

Advertisment
తాజా కథనాలు