ATM Damage Currency: డబ్బు ఎవరికి అవసరం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరి జేబులో ఎంతో కొంత మొత్తంలో డబ్బు(Money) ఉంచుకుంటారు. ఒకవేళ డబ్బు లేకపోతే.. తమ వెంట ఏటీఎం కార్డులను(ATM Cards) తీసుకెళ్తుంటారు. డబ్బు కోసం పదే పదే బ్యాంకుకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అదే ఏటీఎం కార్డ్ ఉంటే.. అవసరమైనప్పుడు ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వీలుంటుంది.బ్యాంకుల వారీగా పలుచోట్ల ఏటీఎం మిషన్లు కూడా ఉంటాయి. అయితే, కొన్నిసార్లు ఏటీఎం మెషీన్లు మనల్ని కంగారు పెట్టిస్తాయి. చిరిగిన పాత నోట్లు ఆ మెషిన్ల నుంచి వస్తుంటాయి. అయితే, ఒకవేళ మీకు కూడా ఇలాగే పాత నోట్లు వస్తే.. ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఒకవేళ మీకు చిరిగిన, చెల్లని నోట్లు ఏటీఎం మిషిన్ల నుంచి వస్తే.. ఆ నోట్లను తీసుకుని నేరుగా బ్యాంక్‌కు వెళ్లాలి. అలాంటి చిరిగిన నోట్లను బ్యాంకు మార్చి ఇస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. మ్యుటిలేటెడ్, పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంక్‌లో అవకాశం కల్పించింది. దీని ప్రకారం ATM నుండి విత్‌డ్రా చేయబడిన మ్యుటిలేటెడ్ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకు నిరాకరించదు. ఈ నోట్లను బ్యాంకులో సులభంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీ ఉండదు. నోట్ల మార్పిడికి బ్యాంకు నిరాకరిస్తే రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చని ఆర్బీఐ సర్క్యులర్‌లో పేర్కొంది. సర్క్యులర్ ప్రకారం.. ATM నుండి బయటకు వచ్చే అన్ని చిరిగిపోయిన, పాత, నకిలీ నోట్లకు బ్యాంకు బాధ్యత వహిస్తుంది.
ఎన్ని నోట్లను ఒకేసారి మార్చుకోవచ్చు..
రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. ATM నుండి బయటకు వచ్చే నోట్లలో తేడా ఉంటే.. బ్యాంకు ద్వారా దర్యాప్తు చేయించాల్సి ఉంటుంది. మ్యుటిలేటెడ్ నోట్ల మార్పిడికి సంబంధించి ఆర్‌బీఐ సర్క్యులర్‌లు జారీ చేసింది. దీని ప్రకారం, ఒక వ్యక్తి ఒకేసారి 20 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. దీని మొత్తం విలువ రూ. 5,000 మించకూడదు. అదే సమయంలో, కాలిపోయిన నోట్లు లేదా అనేక ముక్కలుగా చిరిగిపోయిన నోట్లను మార్చుకోవడం సాధ్యం అవదు.
Also Read:
Central Cabinet Decisions: తెలంగాణపై కేంద్రం వరాల జల్లు.. ఎట్టకేలకు కృష్ణా జలాలపై స్పందన..
Chandrababu case: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు?? కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది?