/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/achem.jpg)
Kinjarapu Atchannaidu: పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు కూడా అర్థం కాలేదన్నమాట అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంబటి.. నీకూ చంద్రబాబుకి పోలికా? అంటూ ఫైర్ అయ్యారు.
Also read: చంద్రబాబుకి ప్రాజెక్టు ఇంకా అర్థం కాలేదు.. అందుకే నేను ముందే ఇలా చెప్పాను: అంబటి
'అసలు నీకు TMC అంటే ఏంటో తెలుసా ? కాఫర్ డ్యాం ఎందుకు కడతారో తెలుసా ? కాఫర్ డ్యాం ఉపయోగం తెలుసా ? కాఫర్ డ్యాం అనేది పనులు అయ్యే వరకు కేవలం నదిని మళ్ళించటానికి. ఆ మళ్లింపుకి కాఫర్ డ్యాం ఒక్కటే సొల్యూషన్ కాదని, కాఫర్ డ్యాం లేకుండా పోలవరం కడతామని కేంద్రం చెప్పిన విషయాన్ని చంద్రబాబు గారు చెప్పారు'..అయినా, నీకు తెలిసిన విద్యలు వేరే ఉన్నాయిలే.. ఇది నీ సబ్జెక్ట్ కాదు, అన్నిట్లో దూరి అభాసుపాలు అవ్వకు.. మళ్ళీ సంజన దగ్గరకు వెళ్లి తలంటు పోసుకోవాలి'.. అంటూ సెటైర్లు వేశారు.
అంబటి, నీకూ చంద్రబాబు గారికి పోలికా ?
అసలు నీకు TMC అంటే ఏంటో తెలుసా ? కాఫర్ డ్యాం ఎందుకు కడతారో తెలుసా ? కాఫర్ డ్యాం ఉపయోగం తెలుసా ? కాఫర్ డ్యాం అనేది పనులు అయ్యే వరకు కేవలం నదిని మళ్ళించటానికి. ఆ మళ్లింపుకి కాఫర్ డ్యాం ఒక్కటే సొల్యూషన్ కాదని, కాఫర్ డ్యాం లేకుండా పోలవరం కడతామని… https://t.co/PefEw7vUvupic.twitter.com/2gvUhetHGf— Kinjarapu Atchannaidu (@katchannaidu) June 30, 2024
Follow Us