/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-29-1-jpg.webp)
కరెంటు ఉన్న ఇంట్లో కచ్చితంగా సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది.ఇప్పుడున్న ఎండల వేడిమికి అందిరి ఇంటిలో కూలర్లు, ACలు ఉంటున్నాయి. కానీ అవి వినియోగిస్తున్న ఇంటిలో సీలింగ్ ఫ్యాన్‌లను మాత్రం వాడకుండా ఉండలేరు. కానీ, చాలా మంది తమ ఫ్యాన్ కంటే ప్రక్క ఇంటివారి ఫ్యాన్ ఎక్కువ గాలి వస్తుందని ఫిర్యాదు చేస్తారు. వాస్తవానికి, గాలి గది పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. మంచి గాలి కావాలంటే నిర్ణీత ఎత్తులో ఫ్యాన్‌ను అమర్చుకోవడం తప్పనిసరి. ఫ్యాన్ గాలికి మాత్రమే కాకుండా భద్రతకు కూడా తగిన ఎత్తులో అమర్చడం చాలా ముఖ్యం. కానీ, చాలా మందికి ఫ్యాన్‌ని ఎంత ఎత్తులో వేలాడదీయాలి అనే విషయం చాలా మందికి తెలియదు.
ఎత్తు ఎంత ఉండాలి:
గది అంతస్తు నుంచి 8 నుంచి 9 అడుగుల ఎత్తులో ఫ్యాన్ అమర్చాలి. ఇంత ఎత్తులో ఫ్యాన్ అమర్చినప్పుడు గది మొత్తానికి గాలిని అందిస్తుంది. అలాగే, ఫ్యాన్ ఎల్లప్పుడూ సీలింగ్‌కి కనీసం 8 అంగుళాలు దిగువన ఉండాలి. పైకప్పుకు దగ్గరగా ఉండటం వల్ల, ఫ్యాన్ తక్కువ గాలిని సరఫరా చేస్తుంది. ఎక్కువ వేడి గాలిని విసురుతుంది. నేల పై నుంచి కనీసం 8 అడుగుల దూరంలో అమర్చటం వల్ల ఫ్యాన్‌కు చేతులు తల తగిలే అవకాశం ఉండదు.
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి:
ఫ్యాన్ ఎల్లప్పుడూ గది మధ్యలో అమర్చాలి. గోడలకు ఎప్పుడూ ఫ్యాన్ ను అమర్చకూడదు. దాని చుట్టూ కర్టెన్లు లేదా గాలికి ఎగిరిపోయే ఇతర వస్తువులు ఉంచకూడదు. ఫ్యాన్‌ను సీలింగ్‌కు వేలాడదీసేటప్పుడు, వేలాడదీసిన హుక్ పైకప్పు బలంగా ఉండేలా చూసుకోండి.