Astrology Tips: హిందూ సంప్రదాయం ప్రకారం.. ప్రతి హిందువు ఇళ్లలో ఒక చిన్న దేవాలయం ఉంటుంది. దేవుడి(Home Temple) కోసం ప్రజల తమ ఇళ్లలో ఒక చిన్నపాటి మందిరాన్ని నిర్మిస్తారు. ఉదయం, సాయంత్రం పూజలు చేస్తూ దేవుళ్లను ఆరాదిస్తారు. ఆ పూజా గృహాలలో వివిధ దేవుళ్ళ, దేవతల చిన్న విగ్రహాలు ప్రతిష్టించడం జరుగుతుంది. ఇంట్లో దేవతలను నెలకొల్పి.. పూజలు చేసే ఇళ్లలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఆ కుటుంబంలో సంపద, శ్రేయస్సుతో సహా అన్ని ఆనందాలు వస్తాయి. అయితే, ఇంట్లో ఏర్పాటు చేసే గుడిలో ఎప్పుడూ ప్రతిష్టించకూడని విగ్రహాలు కొన్ని ఉన్నాయి. ఆ విగ్రహాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఆ దేవుళ్లను, దేవతలను బయట దేవాలయాల్లో మాత్రమే పూజించాలి. లేదంటే.. వితం కష్టాల్లో కూరుకుపోతుందని వేద పండితులు చెబుతున్నారు. మరి ఏ దేవుళ్ల విగ్రహాలను ఇంట్లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
రాహు-కేతు..
వేద గ్రంధాలలో, రాహు-కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. మత గ్రంధాల ప్రకారం.. రాహు కేతు అమృతం తాగడం ద్వారా అమరుడయ్యాడట. దాంతో అతను రాక్షసుడిలా మారి.. అరాచకాలకు పాల్పడ్డాడు. అతని దురాగతాలు పెరిగిపోయాయి. దాంతో అతన్ని చేయడానికి శ్రీ మహా విష్ణువే నేరుగా రంగంలోకి దిగాడట. విష్ణువు అతని తలన నరికేయగా.. రెండు భాగాలుగా విడిపోయింది. దాంతో అతని తల రాహువు, మొండె కేతువుగా పిలవడం జరిగింది. ఈ రాహు-కేతు విగ్రహాన్ని ఇంట్లో ఎప్పుడూ ప్రతిష్టించొద్దు.
మహాకాళి..
మహాకాళిని తల్లి దుర్గ, పార్వతి మాతకు మరొక రూపంగా భావిస్తారు. దుష్టులను సంహరించడానికి భూమిపైకి వచ్చిన దుర్గా స్వరూపిణి. ఇంట్లో మహంకాళి విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి వస్తుందని అంటుంటారు. ఇంట్లో గొడవలు, తగాదాలు ఎక్కువవుతాయట. అందుకే ఇంట్లో కాళీ విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని, కేవలం గుడిలో మాత్రమే పూజించాలని చెబుతున్నారు.
నరసింహ స్వామి..
మత గ్రంథాల ప్రకారం.. దుష్ట హిరణ్యకష్యపుని చంపడానికి విష్ణువు భూమిపై నరసింహునిగా అవతరించాడు. మెడ వరకు మనిషి శరీరం, తల మాత్రం సింహం అవతారంలో వచ్చిన నరసింహుడు.. హిరణ్యకష్యపుడిని అంతమొందిస్తాడు. అలా హిరణ్యకష్యపుని రక్తాన్ని కూడా తాగుతాడు. ఈ ఉగ్ర నరసింహ అవతారంతో కూడిన విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టంచ కూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో, కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు పండితులు.
శని దేవ్..
శని దేవుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు. ఆయన ఎవరిపైనా పగ పెంచుకోరు. వ్యక్తి కర్మలను బట్టి తగిన ఫలితాలను ఇస్తారు. శని ఎవరినీ ఇబ్బంది పెట్టనప్పటికీ, ఎవరైనా తప్పు చేస్తే.. శని క్రూరమైన దృష్టి అతన్ని నాశనం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు అని విశ్వాసం. అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని దేవుడి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకురావడం నిషిద్ధం.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత గ్రంథాల ఆధారంగా, ప్రజల సాధారణ ఆసక్తుల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆర్టీవీ ధృవీకరించడం లేదు.
Also Read:
Chandrababu Arrest: చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది.. నారా లోకేష్ సంచలన ఆరోపణలు..