Asia Games 2023: ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆదివారం జరిగిన ఈ గేమ్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ 15 పతకాలు సాధించారు. తద్వారా హిస్టరీ క్రియేట్ చేశారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత ఆటగాళ్లు 15 పతకాలు సాధించారు. అంతకు ముందు అంటే 2010 ఆసియా గేమ్స్‌లో 14వ రోజున ఇండియా 11 పతకాలు సాధించింది రికార్డ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు రికార్డ్‌ను చెరిపేస్తూ 15 పతకాలు సాధించారు ప్లేయర్స్.
2010 రికార్డ్‌ను బద్దలు కొట్టి ఇండియన్ ప్లేయర్స్..
ఆదివారం ఒక్కరోజే 15 పతకాలు సాధించడం ద్వారా అత్యధిక పతకాలు సాధించిన ఓల్డ్ రికార్డ్‌ను ఇండియా రీక్రియేట్ చేసింది. ఆసియా గేమ్స్ 2014లో 8వ రోజున భారత్ 10 పతకాలు సాధించింది. జకర్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో 9వ రోజు భారత్ 10 పతకాలు సాధించింది. నేడు ఆ పాత రికార్డులన్నింటినీ చెరిపేసింది. ఆసియా గేమ్స్ 2023లో భారత్ 15 పతకాలు సాధించింది. ఇక ఈ గేమ్స్‌లో ఇప్పటి వరకు 13 బంగారు సాధించింది భారత్. 19 రజత పతకాలను కైవసం చేసుకున్నారు. 19 కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఇక ఆసియా గేమ్స్ 2023 మొత్తంగా చూసుకుంటే.. ఇప్పటి వరకు మొత్తం 51 పతకాలు సాధించి భారత్ నాలుగో స్థానంలో ఉంది.
టాప్‌లో ఈ దేశం..
పతకాల సంఖ్యలో మొదటి స్థానంలో ఆతిథ్య చైనా నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు చైనా 242 పతకాలు గెలుచుకుంది. 131 బంగారు పతకాలు, 72 రజత పతకాలు, 39 కాంస్య పతకాలు గెలుచుకుంది. ఆ తరువాత స్థానంలో దక్షిణ కొరియా నిలిచింది.
Also Read: