US Open 2024: యూఎస్‌ ఓపెన్‌..తొలిసారి టైటిల్ నెగ్గిన అరీనా సబలెంక!

యూఎస్‌ ఓపెన్‌ 2024 మహిళల ఛాంపియన్‌ టైటిల్‌ ని అరీనా సంబలెంక కైవసం చేసుకుంది. తన కెరీర్ లో మొదటిసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ ని ఆమె సొంతం చేసుకుంది.ఈ యూఎస్‌ ఓపెన్‌ ను గెలవడంతో తన గ్రాండ్‌ స్లామ్‌ల సంఖ్యను మూడుకు చేరింది.

New Update
US Open 2024: యూఎస్‌ ఓపెన్‌..తొలిసారి టైటిల్ నెగ్గిన అరీనా సబలెంక!

US Open 2024: యూఎస్‌ ఓపెన్‌ 2024 మహిళల ఛాంపియన్‌ గా అరీనా సబలెంక నిలిచింది. ఫైనల్‌ లో అమెరికా కు చెందిన పెగులా పై 7-5, 7-5 తేడాతో ఆమె ఈ విజయాన్ని అందుకుంది. దీంతో తన కెరీర్ లో మొదటిసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ ని ఆమె సొంతం చేసుకుంది.

ప్రపంచ నంబర్‌ 2 ర్యాంకర్‌ అయిన సబలెంక గత యూఎస్ ఓపెన్‌ ఫైనల్‌ కు చేరినప్పటికీ టైటిల్‌ ను సాధించలేకపోయింది. కోకో గాఫ్‌ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు ఈ యూఎస్‌ ఓపెన్‌ ను గెలిచిన 26 ఏళ్ల బెలారస్‌ క్రీడాకారిణి సబలెంక తన గ్రాండ్‌ స్లామ్‌ల సంఖ్యను మూడుకు చేర్చింది.

Also Read: తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన..మరో నాలుగు రోజులు!

Advertisment
తాజా కథనాలు