AP: వీర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు లద్ధాఖ్‌లో మృతి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డికి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని చూసిన కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. రామకృష్ణారెడ్డి స్వగ్రామం ప్రకాశం జిల్లా కాలువపల్లెలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. By Jyoshna Sappogula 02 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి Army jawan Ramakrishna Reddy : లద్ధాఖ్‌లో మృతి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డికి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా కాలువపల్లెలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలకు సిద్ధం చేశారు. రామకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని చూసిన కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. రామకృష్ణారెడ్డి భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యే నాగార్జున నివాళులర్పించారు. భారత్-చైనా సరిహద్దులోని షియోక్ నదిలో జరిగిన దుర్ఘటనలో రామకృష్ణారెడ్డితో పాటు ఏపీకి చెందిన మరో ఇద్దరు జవాన్లు దుర్మరణం చెందారు. రామకృష్ణారెడ్డి స్వగ్రామం ప్రకాశం జిల్లా కాలువపల్లె. ఇక కృష్ణా జిల్లా చేవేండ్రకు చెందిన నాగరాజు, బాపట్ల జిల్లా ఇస్లాంపూర్‌కు చెందిన సుభాన్‌ఖాన్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. Also Read: సీఎం చంద్రబాబు ఇంటి కోసం లంచం డిమాండ్…సర్వేయర్ సస్పెండ్! భారత వాయుసేనకు చెందిన విమానంలో జవాన్ల భౌతిక కాయాలను ఆర్మీ అధికారులు నిన్న స్వస్థలాలకు తరలించారు. నిన్న సాయంత్రం నాగరాజు, సుభాన్‌ఖాన్ అంత్యక్రియలు ముగిసాయి. జవాన్ల భౌతికకాయాలకు పలువురు సైనికాధికారులు నివాళులు అర్పించారు. దేశరక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన సోల్జర్స్‌కు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు నివాళులర్పించారు. కాసేపట్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, జూన్ 29న లద్ధాఖ్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. LAC సమీపంలో సైనిక విన్యాసాలు జరుగుతుండగా ఐదుగురు జవాన్లు నీటిలో కొట్టుకుపోయారు. ట్రైనీ సోల్జర్స్ నదిలో ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో రివర్ క్రాసింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తుండగా ఒక్కసారిగా నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో వరద తీవ్రతకు T-72 యుద్ధ ట్యాంక్ ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న ట్రైనీ సోల్జర్స్ వరద ఉధృతికి కొట్టుకుపోయారు. లేహ్‌కు 148కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా నదిలో ప్రవాహం పెరగడమే ఈ ప్రమాదానికి కారణమని ఆర్మీ అధికారులు తెలిపారు. #army-jawan-ramakrishna-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి