మెడిసిన్స్ వాడుతున్నారా?ఈ విషయాలు తెలుసుకోండి!

రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా మెడిసిన్స్ వాడుతుంటారు చాలామంది. అయితే సమస్య కాస్త తగ్గుముఖం పట్టగానే మెడిసిన్స్ మధ్యలో మానేసే వాళ్లూ ఉంటారు. అయితే మానేసేముందు ఈ విషయాలు తెలుసుకోండి! 

మెడిసిన్స్ వాడుతున్నారా?ఈ విషయాలు తెలుసుకోండి!
New Update

రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా మెడిసిన్స్ వాడుతుంటారు చాలామంది. అయితే సమస్య కాస్త తగ్గుముఖం పట్టగానే మెడిసిన్స్ మధ్యలో మానేసే వాళ్లూ ఉంటారు. ఇలా కోర్సు పూర్తవ్వకుండా మందులు మానేయడం వల్ల చాలా ప్రమాదమే ఉందంటున్నారు డాక్టర్లు. అదెలాగంటే.. జబ్బు చేసినప్పుడే ఆరోగ్యం విలువ తెలుస్తుంది. సమస్య రాగానే వెంటనే భయంతో డాక్టర్‌ దగ్గరకు పరుగులు పెడతారు. డాక్టర్ ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వేసుకుంటారు. కానీ, జబ్బు కాస్త తగ్గినట్టు అనిపిస్తే చాలు.. అప్పటివరకూ ఉన్న భయం కాస్తా నిర్లక్ష్యంగా మారుతుంటుంది. ‘లక్షణాలు లేవు కదా’ అని కోర్సు పూర్తి కాకుండానే మందులు మానేస్తుంటారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారట. కోర్సు పూర్తవ్వకముందే మందులు మానేయడం వల్ల సమస్య పూర్తిగా తగ్గకపోగా శరీరానికి మెడిసిన్ రెసిస్టెన్స్ వస్తుంది. తద్వారా శరీరంపై మందుల ప్రభావం తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు జబ్బుకు ట్రీట్మెంట్ చేయడం కష్టమవుతుంది.

అంగీకరించిన ఆస్ట్రాజెనెకా డయాబెటిస్, బీపీ, గుండె సమస్యలతో సహా రకరకాల జబ్బులకు ఎక్కువ కాలం మందులు వాడాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో చాలామంది ‘జీవితాంతం మందులు వాడాలా?’ అని వాపోతుంటారు. సమస్య తగ్గినట్టు అనిపించగానే.. మందులు మానేస్తుంటారు. దీనివల్ల లోపలి సమస్య తగ్గినట్టే తగ్గి తిరగబెడుతుంది. దీనివల్ల పరిస్థితి అంతకుముందు కంటే సీరియస్‌గా మారొచ్చు. కాబట్టి ఏ సమస్యకైనా డాక్టర్ నిర్ధేశించినంత కాలం కోర్సు ప్రకారం మందులు వాడాలి. జాగ్రత్తలు ఇలా.. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలకు మందులు వాడేవాళ్లలో చాలామంది యూట్యూబ్‌లో చూసి ఏవేవో టిప్స్‌ పాటిస్తూ.. మందులు మానేస్తుంటారు. అయితే సమస్య తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్‌తో షుగర్‌‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి, లైఫ్‌స్టైల్ డిసీజ్‌లకు కూడా మందులు సాయం తీసుకోక తప్పదు. మందులు వాడుతూ లైఫ్‌స్టైల్ మార్చుకుంటే సమస్య ఇంకా త్వరగా తగ్గే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు.

బీపీ, షుగర్‌లు కాస్త అదుపులోకి రాగానే మందుల్ని మధ్యలోనే ఆపేస్తుంటారు చాలామంది. నిజానికి మందులు వాడడం వల్లనే అవి అదుపులో ఉన్నాయనేది గుర్తించాలి. మధ్యలో ఆపేస్తే ఉన్నట్టుండి ఎప్పుడైనా తిరగబెట్టొచ్చు. ఖర్చు ఎక్కువ అవుతుందనే కారణంతో చాలామంది మందులు మానేస్తుంటారు. అయితే జబ్బు తీవ్రమై ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చుతో పోల్చితే.. డాక్టర్లు చెప్పినట్టు మందులు వాడడం వల్ల అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకే మందుల ఖర్చును ఆరోగ్యానికి పెట్టుబడిగా చూడాలి.

ఈ జాగ్రత్తలు మస్ట్! మందులు వాడడం మాత్రమే కాదు, డాక్టర్లు చెప్పిన విధంగా టెస్ట్‌లు కూడా చేయించుకోవాలి. అప్పుడే ఇచ్చిన మందులు పని చేస్తున్నాయా? లేదా? అన్నది తెలుస్తుంది. రోజూ ఒకే టైంకి మందులు వేసుకోవాలి. మందులు వాడుతూనే లైఫ్‌స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. డాక్టర్లు ఆపమనే వరకూ మందులు ఆపకూడదు. మందులు వేసుకోవడంలో ఇబ్బందులుంటే డాక్టర్‌ని అడిగి‌ సలహా తీసుకోవాలే తప్ప సోంత నిర్ణయాలు తీసుకోవద్దు. కోర్సు ప్రకారం మందులు వాడడం ద్వారానే సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది.

#medicines
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe