Vastu Tips for Good Health : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్లనైతేనేమి, ఉరుకుల పరుగుల జీవితం వల్ల కావచ్చు వీటి ప్రభావం ప్రతి ఒక్కరి జీవన విధానం చాలా గందరగోళంగా మారింది. ముఖ్యంగా ప్రాధమికంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే వారి సంఖ్య తగ్గిపోయింది. పొజిషన్ పీక్స్ లో ఉన్నపుడు మాత్రమె ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తే ఏం లాభం. మంచి ఆరోగ్యం. ఫిట్‌నెస్ కంటే గొప్పది ఏదీ లేదు. అందుకే హెల్త్ ఈజ్ వెల్త్(Health is Wealth) అన్నారు. ప్రతి వ్యక్తి జీవించి ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఒక వ్యక్తికి బ్యాడ్ టైం అయినా, అనారోగ్యమైనా ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా నేటి కాలంలో బిజీ లైఫ్(Busy Life), బయటి తిండి(Outside Food) వల్ల అనారోగ్యం పాలైనప్పుడు, ఇంట్లో ఎవరైనా ప్రతిరోజూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, డాక్టర్ చికిత్సతో పాటు, మీరు జ్యోతిష్యం(Astrology), వాస్తుకు(Vastu Tips) సంబంధించిన కొన్ని నివారణలను కూడా ప్రయత్నించవచ్చు.
మంచి ఆరోగ్యం కోసం ఇలా చేయండి
ఇంట్లో తులసి మొక్క(Holy Basil) ఉండటం మంచిది. అలాగే సూర్య భగవానుడి బొమ్మ కూడా పెట్టుకోవడం వల్ల చలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ రాయండి. కుటుంబం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ దేవుడిని ప్రార్థించండి. చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం ముందు గుంతలు, మురికి నీటి గుంతలు ఉన్నా పట్టించుకోరు. అవి లేకుండా జాగ్రత్త పడండి. పడకగదిలో అద్దం తొలగించండి. ఇంట్లో దేవుని చిత్రపటాన్ని దక్షిణాభిముఖంగా ఉంచాలి. ఆవుకు వరుసగా 3 రోజులు, గోధుమ పిండితో చేసిన ఆహారాన్ని తినిపించండి. మీరు ఏ ఆదివారం నుండైనా ఈ నివారణను ప్రారంభించవచ్చు. ఖచ్చితంగా ఈ 3 రోజులలో వ్యక్తి ఆరోగ్యంవతుడిగా మారుతాడు. చికిత్స సమయంలో రోగి కోలుకున్నప్పటికీ, ప్రయోగాన్ని పూర్తి చేయాలి. మధ్యలో ఆపకూడదు. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, అతను దక్షిణం వైపు తల పెట్టి నిద్రించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, మందులు, నీరు ఈ దక్షిణ దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇలా చేయడం వల్ల రోగి ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుంది.
(గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.)
ALSO READ: అంబులెన్స్ కి అద్దె చెల్లించలేక మృతదేహాన్ని ఏం చేసారో చూస్తే షాక్ అవుతారు!!!