చద్ధనం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఓకప్పుడు రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్దన్నం అనేవారు. ఇది శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

New Update
చద్ధనం వల్ల కలిగే ప్రయోజనాలు..

పెద్దల మాట చద్ది మూట’ అన్న సామెత తెలుగువారికి సుపరిచితమే. పెద్దలు ఎప్పుడూ మంచే చెబుతారన్నది దాని సారాంశం. ఇప్పుడంటే మనకు ఉదయాన్నే టిఫిన్ కింద ఇడ్లీ, వడ, దోసె, బ్రెడ్ వంటి పదార్థాలు తింటున్నాం గానీ.. పూర్వకాలంలో అందరూ ఉదయాన్నే చద్దన్నమే తినేవారు. రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్దన్నం అనేవారు. ఇది శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మన పూర్వీకులు ఎన్నాళ్లయినా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేవారు. ఉద‌యాన్నే చ‌ద్దన్నం, పెరుగు క‌లుపుకుని తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

* రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చద్దన్నం బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకొని తింటే రక్తహీనత నుంచి బయటపడొచ్చు. చద్దన్నం తింటే శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి.వేసవికాలంలో చద్దన్నం తింటే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. ఎండ వల్ల కలిగే నీరసాన్ని నివారిస్తుంది.

* ఉదయాన్నే చద్దన్నం తింటే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం పరమౌషధంలా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తింటే అన్ని అవయవాలకు బలం కలుగుతుంది. చద్దన్నంలో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చద్దన్నం తింటే అధిక రక్తపోటు, మలబద్ధక సమస్యలు దూరమవుతాయి.

Advertisment
తాజా కథనాలు