మద్యం సేవిస్తే ఇక అంతే సంగతంటున్నారు..వైద్యులు!

మద్యం సేవించడం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదం, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది.అయితే మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు.అయితే వీటితో పాటు మరొక వ్యాధికూడా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.అవేంటో చూద్దాం.

మద్యం సేవిస్తే ఇక అంతే సంగతంటున్నారు..వైద్యులు!
New Update

మద్యం సేవించటం వ్యసనం అయితే ప్రాణాలకే ప్రమాదం చాలామంది సంతోషకర సమయమైనా, విచారకర సమయమైనా మద్యం సేవించడానికి ఇష్టపడతారు. మొదట సరదా.. తర్వాత అలవాటుగా.. ఆపై వ్యసనంగా మారుతుంది. అలా మద్యం సేవించడం వ్యసనంగా మారితే అది ప్రాణాల మీదకు తెస్తుంది. అతిగా మద్యం సేవించే అలవాటు ఉంటే త్వరితగతిన దానిని మానుకోవలసిన అవసరం ఉంది.

మద్యపానం కారణంగా లివర్, ప్యాంక్రియాస్ కు ప్రమాదం తరచూ మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది. ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ ఫెయిల్యూర్ అవుతుంది. కాలేయం వాపు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ మరియు ఇతర రసాయనాలు ఉత్పత్తి అయ్యే శరీరంలోని అవయవం. మద్యపానం వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఇది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు కూడా దారితీస్తుంది.

క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదం మద్యం ఎక్కువ సేవించడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. మద్యాన్ని తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో రక్తంలో చక్కెరస్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా మధుమేహం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేషనల్ హార్ట్ అసోసియేషన్ చెప్పిన వివరాల ప్రకారం ఆల్కహాల్ గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఆల్కహాల్ ఎక్కువ సేవించే వారిలో రక్తంలో కొవ్వు స్థాయిలు పెరిగి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

#alcohol-effects
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe