Hemachandra Reddy: ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తీరు హాట్‌టాపిక్‌గా మారింది. హేమచంద్రారెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఏపీ నిరుద్యోగుల ఫోరం నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్యా మండలిలో రూ.200 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
Also read: విజయవాడలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే వంశీ ఇంటిపై దాడి.!
ఇష్టానుసారంగా వర్సిటీ వీసీలను నియమించారని.. హేమచంద్రారెడ్డి వ్యవహారంపై విచారణ చేయించాలని కోరారు. అయితే, ఎన్నికల ఫలితాలు రాగానే ఫైళ్లను మాయం చేసి హేమచంద్రారెడ్డి మెడికల్ లీవ్‌పై వెళ్లిపోయారని తెలిపారు.