Nara Bhuvaneshwari: గాంధీ లాంటి మహనీయుడుకి కూడా జైలు జీవితం తప్పలేదు..దీక్ష విరమించిన నారా భువనేశ్వరి!

మహాత్మాగాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు తప్పలేదన్నారు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి. సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆమె రాజమండ్రిలో ఒక రోజు సత్యాగ్రహ దీక్ష చేశారు. భువనేశ్వరికి ఇది తొలి పూర్తిస్థాయి రాజకీయ పర్యటన. చిన్నపిల్లల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించారు భువనేశ్వరి.

Nara Bhuvaneshwari: గాంధీ లాంటి మహనీయుడుకి కూడా జైలు జీవితం తప్పలేదు..దీక్ష విరమించిన నారా భువనేశ్వరి!
New Update

Chandrababu arrest row: తన భర్త చంద్రబాబు అరెస్ట్‌(Chandrababu arrest)ని నిరసిస్తూ ఒక్క రోజు సత్యాగ్రహ దీక్ష చేసిన నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) తన దీక్షను విరమించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి(Rajamahendravaram)లో చిన్నపిల్లల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకున్నారు భువనేశ్వరి.

publive-image దీక్ష విరమించిన నారా భువనేశ్వరి

నారా భువనేశ్వరి ఏం అన్నారంటే:

➼ చంద్రబాబు నా ఆయుషు కూడా పోసుకుని బతికి ప్రజలుకి సేవ చేయాలి

➼ ఈ దీక్ష ప్రజలు కోసం చేస్తున్నాను

➼ నా తండ్రి, భర్త ఎప్పుడు ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేయలేదు, మాకు ఆ అలవాటు లేదు

➼ మేము నలుగురుము నాలుగు దిక్కులు అయిపోయాం

➼ మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు

➼ చంద్రబాబు జైలుకు వెళ్లడాన్ని తట్టుకోలేక చనిపోయిన 105 కుటుంబాలును నేను పరామర్శిస్తాను. వారికి అండగా ఉంటాను

➼ అవసరం అయినప్పుడు ప్రజలుతో ఉంటాను, పోరాటం చేస్తాను

➼ గాంధీ లాంటి మహనీయుడుకి కూడా జైలు జీవితం తప్పలేదు.

➼ త‌ప్పు చేయ‌ని మేం అందరం జైలుకు వెళ్లినా మాకు బాధలేదు… పార్టీని నడిపించే కార్యకర్తలు మాకున్నారు… వాళ్లే పార్టీని ముందుకు తీసుకెళతారు.

అందరికి కృతజ్ఞతలు:
సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు భువనేశ్వరి. నాడు తెల్లదొరలపై పోరాడి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు తప్పలేదు. ఆయన ఎంతో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ జైలు నుంచి బయటికి వచ్చాక ప్రజలతో కలిసి మళ్లీ పోరాడారన్నారు భువనేశ్వరి. ఈ దీక్షలో తాను పాల్గొన్నది చంద్రబాబు కోసమో, తమ కుటుంబం కోసమో కాదని.. ప్రజల కోసమన్నారు భువనేశ్వరి. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తడానికి ఈ దీక్షలో పాల్గొన్నానని చెప్పారు. మరోవైపు నారా భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాయలసీమలోని కుప్పంలో అక్టోబర్ 5న యాత్ర ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఫలితాన్ని బట్టి తేదీ మారవచ్చు. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి భువనేశ్వరి రాజమండ్రిలోనే మకాం వేసి వివిధ నిరసనల్లో పాల్గొంటున్నారు. బయటి నుంచి చంద్రబాబుకు ఇచ్చే ఆహారాన్ని ఆమె జాగ్రత్తగా చూసుకుంటున్నారని, ప్రతి వారం ఆయనను కలుస్తున్నారన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆమె రాజమండ్రిలో ఒక రోజు దీక్ష చేశారు. భువనేశ్వరికి ఇది తొలి పూర్తిస్థాయి రాజకీయ పర్యటన. తన తండ్రి ఎన్టీ రామారావు, భర్త చంద్రబాబు నాయుడు రెండు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ భువనేశ్వరి ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు, సచివాలయంలో కాలు పెట్టలేదు. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత భువనేశ్వరి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపిస్తున్నారు.

ALSO READ: తెలంగాణలో పోటీకి జనసేన సై.. 32 స్థానాలతో లిస్ట్ రిలీజ్!

#chandrababu-arrest #nara-bhuvaneshwari #ap-skill-development-scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe