Skill scam case: స్కిల్‌ స్కామ్‌ కేసులో ఈడీ పిడుగు ఆ అధికారులకు నోటీసులు!

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అరెస్ట్ అవ్వగా.. మరింత మంది అధికారులకు ఈ కేసు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. రిటైర్డ్‌ IAS పీవీ రమేశ్‌కి ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటిసులు ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

New Update
Skill scam case: స్కిల్‌ స్కామ్‌ కేసులో ఈడీ పిడుగు ఆ అధికారులకు నోటీసులు!

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇప్పటికే ఈ కేసులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అరెస్ట్ అవ్వగా.. మరింత మంది అధికారులకు ఈ కేసు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఓ రిటైర్డ్‌ IAS అధికారికి ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. మరింత మందికి ఈ కేసు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. మరింత మందికి ఈడీ నోటిసులు ఇవ్వనుందని సమాచారం. త్వరలోనే ఈడీ మరింత మందికి నోటిసులు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

publive-image ఈడీ లిస్ట్

ఈడీ దూకుడు:
మరోవైపు స్కిల్‌ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచుతోంది. షెల్‌ కంపెనీలకు నిధుల మళ్లింపుపై ఈడీ ఫోకస్‌ చేసింది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ చేసిన ఈడీ.. మనీలాండరింగ్‌ కింద కేసు నమోదు చేసింది. దర్యాప్తు ఆధారంగా త్వరలో మాజీ అధికారులకి నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈడీ ఫోకస్‌ పెట్టిన ఆ అధికారులు ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం నుంచి సీమన్స్‌ కంపెనీకి వచ్చిన నిధుల్ని షెల్‌ కంపెనీలకు మళ్లించారు నిందితులు. శేఖర్‌ బోస్‌, ముకుల్‌ అగర్వాల్‌, సురేష్‌ గోయల్‌, వికాస్‌ వినాయక్‌లను ఇప్పటికే విచారించింది ఈడీ. షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసి రూ.241 కోట్లను మళ్లించారని ఆరోపణలున్నాయి. ఇప్పటికే డిజైన్‌ టెక్‌కి సంబంధించిన రూ.31.20 కోట్ల ఆస్తులు జప్తు చేశారు. ఇక ముందుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి నోటిసులు వచ్చే అవకాశం ఉందని.. ఆయన్ను విచారిస్తే మరింత మంది పేర్లు తెలుస్తాయని ఈడీ భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో రాజకీయ నేతలు కూడా ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికి వరకు ఎవరెవరు అరెస్ట్ అయ్యారంటే?
1) సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, M/s సిమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ MD

2) వికాస్ వినాయక్ ఖాన్వెల్కర్ (MD, M/s Designtech Systems Pvt Ltd)

3) ముకుల్ చంద్ర అగర్వాల్, మాజీ- ఆర్థిక సలహాదారు, M/s Skillar Ent India Pvt Ltd

4) సురేష్ గోయల్, CA మనీలాండరింగ్ కేసులో నిధుల మళ్లింపు, దుర్వినియోగం

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో APSSDC ఏర్పాటైంది. నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా నిరుద్యోగ యువత సాధికారతపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. 3,300 కోట్ల రూపాయల కుంభకోణంపై AP CID మార్చిలో దర్యాప్తు ప్రారంభించింది. సరైన టెండర్ ప్రక్రియను అనుసరించకుండా ప్రాజెక్ట్ ప్రారంభించారన్న ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి ప్రాజెక్ట్‌కి ఆమోదం లేదు. సిమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా వనరులను పెట్టుబడి పెట్టడంలో వైఫల్యం లాంటి అనేక ఇతర అవకతవకలను కూడా దర్యాప్తులో బయటపెట్టింది. ప్రాజెక్ట్ కోసం కేటాయించిన నిధులను షెల్ కంపెనీలలోకి పంపారు. సీమెన్స్ గ్లోబల్ కార్పొరేట్ ఆఫీస్ ఈ ప్రాజెక్ట్‌పై అంతర్గత దర్యాప్తులో ప్రాజెక్ట్ మేనేజర్ హవాలా లావాదేవీల ద్వారా ప్రభుత్వం కేటాయించిన సొమ్మును షెల్ వ్యాపారాలకు మళ్లించాడని తేలింది. అందుకే ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు నైపుణ్యం అభివృద్ధి కోసం ఆరు ఎక్స్‌లెన్స్ కేంద్రాలను అభివృద్ధి చేసే పనిని సిమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియాకు అప్పగించారు. ప్రాజెక్టులో సీమెన్స్ సంస్థ వాటా 90శాతం ఉండగా.. రాష్ట్రప్రభుత్వం వాటా 10శాతం ఉంది. సీమెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఆ MOU పక్కనపెట్టారనే ఆరోపణలున్నాయి.

ALSO READ: చంద్రబాబుకు మరో షాక్.. హౌస్‌ రిమాండ్‌కు కోర్టు నో!

Advertisment
తాజా కథనాలు