AP LAWCET : విద్యార్థులకు అలెర్ట్.. ఏపీ లాసెట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్.. ఇలా అప్లై చేసుకోండి! ఏపీ లాసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 25వరకు అప్లై చేసుకోవచ్చు. మూడేళ్ల ఎల్ఎల్బీ, ఐదేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎగ్జామ్‌ను జూన్ 9న నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 26 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి LLB Course : మూడేళ్ల, ఐదేళ్ల LLB కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP LAWCET 2024) రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఇవాళ రారంభించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి cets.apsche.ap.gov.in అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 25, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని మే 3గా నిర్ణయించారు. కరెక్షన్ విండో మే 30న ప్రారంభమై జూన్ 1, 2024న ముగుస్తుంది. ఇక తాజా అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షను 2024 జూన్ 9న నిర్వహించనున్నారు. --> 2024 జూన్ 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్(Download Hall Tickets) చేసుకోవచ్చు. ఏపీ లాసెట్ 2024 పరీక్షను జూన్ 9న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సింగిల్ షిఫ్ట్‌లో నిర్వహిస్తారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీని జూన్ 10న విడుదల చేస్తారు. అభ్యంతర విండోను జూన్ 11న ఓపెన్ చేస్తారు. అభ్యంతరాలు తెలిపేందుకు జూన్ 12 వరకు గడువు ఉంటుంది. --> ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(AP Law Common Entrance Test) కు ఓసీ అభ్యర్థులు రూ.900 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫీజు బీసీ అభ్యర్థులకు రూ.850.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800. ఏపీ పీజీఎల్‌సెట్ ఫీజు ఓసీకి రూ.1000, బీసీలకు రూ.950, ఎస్సీ, ఎస్టీలకు రూ.900. ఆన్లైన్ విధానంలో చెల్లించాలి. CLICK HERE FOR DIRECT LINK ఇలా అప్లై చేయండి: --> ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.(cets.apsche.ap.gov.in.) --> హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఏపీ లాసెట్ 2024 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. --> రిజిస్టర్ చేసుకోవడం ద్వారా అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి. --> అవసరమైన సమాచారాన్ని నింపి తగిన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. --> మీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి, ఫీజు చెల్లించండి. Also Read : యూకేలో తిప్పలు పడుతున్న ఇండియన్ స్టూడెంట్స్.. కారణం ఏంటంటే! #ap-students #ap-lawcet #llb-course మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి