జ్వరాలకు చేపలతో చెక్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం

సీజనల్ వ్యాధులకు నిలువరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపలను సీన్లోకి దించింది. టైఫాయిడ్, మలేరియాతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరాలను నిలువరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు గాను ఏపీ ప్రభుత్వం సుమారు కోటి గంబూసియా చేపలను చెరువు,కుంటలు,కాలువలు,కొలనుల్లో వదిలిపెట్టింది. మత్స్యశాఖతో కలిసి వైద్యారోగ్య శాఖ ఈ చేపలను ఏర్పాటుచేసింది. గంబూసియా చేపలను మస్కిటో ఫిష్ అని కూడా అంటారు. ఈ చేపలు మస్కిటో లార్వాను ఆహారంగా తీసుకుంటాయి. తద్వారా సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వ ఆలోచన.

New Update
జ్వరాలకు చేపలతో చెక్..  ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం

సీజన్ ఎలా వస్తుందో..సంబంధిత వ్యాధులు అలానే వస్తాయి. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, కాలువలు నిండడంతో ఈగలు,దోమలు,కీటకాలు వగైరా వ్యాధికారకాలు పుట్టుకొస్తాయి. దీంతో జనం జబ్బుబారిన పడతారు. అయితే ఈ సీజనల్ వ్యాధులకు నిలువరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపలను సీన్లోకి దించింది.

publive-image

టైఫాయిడ్, మలేరియాతో పాటు ప్రమాదకరమైన డెంగ్యూ జ్వరం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు మామూలు జ్వరాన్ని పోలిఉండడంతో డెంగ్యూజ్వరంగా గుర్తించలేకపోతున్నారు.అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

ఈ వ్యాధులకు చెక్ పెట్టేందుకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇతర శాఖలతో కలిసి వర్షాకాలంలో వచ్చే జ్వరాలు నియంత్రణ, ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా వ్యాధి ప్రభల్యానికి కారణమయ్యే దోమల మీదకు చేపలను ప్రయోగిస్తోంది.

publive-image

సుమారు కోటి చేపలను చెరువులు, నీటి కుంటలు, కొలనుల్లోకి విడుదల చేసింది. తద్వారా మలేరియా,డెంగ్యూ జ్వరాలకు ప్రధాన కారణమైన దోమల నివారణ చేపట్టింది.ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ రాష్ట్రంలో 2వేలకు పైగా డెంగీ కేసులు,1600 వరకూ మలేరియా కేసులు అధికారికంగా నిర్దారణ అయ్యాయి.

దోమలను నివారించడం కోసం గంబూసియా చేపలను చెరువులు,నీటి కుంటలు,కొలనుల్లో కి వదిలిపెట్టింది ఏపీ ప్రభుత్వం. మత్స్య శాఖ తో కలిసి వైద్యారోగ్య శాఖ పెద్ద మొత్తంలో చేపలను విడుదల చేసింది.గంబూసియా చేపలను మస్కిటో ఫిష్ అని కూడా అంటారు. గంబూసియా చేపలు దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందినవి.ఈ చేపలు దోమ లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి.

publive-image

ఆడ చేప 7 సెం.మీ,మగ చేప 4 సెం.మీ ఉంటుంది.పిల్ల చేపలు 8 నుంచి 9 మిమీ వరకూ ఉంటాయి.ఈ చేపలు నీటిలో వేగంగా కదులుతూ నీటిపై ఉండే జ్వరాలకు కారణమైన దోమల లార్వాలను హరించి వేస్తాయి.దీని ద్వారా దోమల నియంత్రణ జరుగుతుంది.

ఈ దోమల జన్మస్థలమైన దక్షిణ అమెరికా లో కొన్నేళ్ల క్రితమే ఇది నిరూపించబడినట్లు అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో జ్వరాలను అరికట్టలేకపోయినా..దోమల నియంత్రణ తో కొంత మేర జ్వరాలు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అందుకే రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి వరకూ గంబూసియా చేపలను ఆయా ప్రాంతాల్లో వదిలిపెట్టినట్లు అధికారులు చెప్పారు. అయితే నాలుగేళ్లుగా రాష్ట్రంలో అక్కడక్కడా ఈ చేపలను వదులుతుండగా…ఈసారి రాష్ట్రం మొత్తం గంబూసియా చేపలను చెరువులు,కొలనుల్లో వదిలిపెట్టినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు