APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీపీఎస్సీ(APPSC)త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

TGPSC Group-1 Key : గ్రూప్-1 ప్రైమరీ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
New Update

APPSC  Group 1 and Group 2 Posts: ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీపీఎస్సీ(APPSC)త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గ్రూప్ 1లో 89 పోస్టులు, గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక మిగిలిన ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రూప్ 1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-2, అసిస్టెంట్ కమిషనర్ (ఎస్టీ), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా పలు ఉద్యోగాలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార, బీసీ సంక్షేమ శాఖ, ఆర్ధిక, హోం, మున్సిపల్ పరిపాలన, రెవెన్యూ, సాంఘిక సంక్షేమం, రవాణా, రహదారులు భవనాల శాఖల్లోని ఖాళీలను గ్రూప్ 1 పోస్టుల ద్వారా.. ఏపీ సచివాలయంలోని ఆర్ధిక, సాధారణ పరిపాలన, న్యాయ, లెజిస్లేచర్ శాఖల్లో గ్రూప్ 2 పోస్టులు ద్వారా APPSC భర్తీ చేయనుంది

గ్రూప్‌ - 1లో ఖాళీ పోస్టుల వివరాలు..

☛ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో- ఆపరేటివ్ సొసైటీస్ - 05

☛ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్( అసిస్టెంట్ డైరెక్టర్) - 01

☛ డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ - 04

☛అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 02

☛ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 06

☛ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - కేటగిరీ - II - 25

☛డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) - 01

☛డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ - 01

☛మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ - II - 01

☛డిప్యూటీ కలెక్టర్ - 12

☛డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ - 03

☛ అసిస్టెంట్ కమిషనర్ (ఎస్టీ) - 18

☛అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ - 01

☛డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 03

☛ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ - 06

గ్రూప్ - 2 లో ఖాళీ పోస్టుల వివరాలు..

☛ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్) - 23

☛ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) - 161

☛ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (న్యాయ శాఖ) - 12

☛ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్ ) - 10

☛ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్  III - 04

☛డిప్యూటీ తహసీల్దార్ (గ్రేడ్  II) - 114

☛ సబ్ - రిజిస్ట్రార్ (గ్రేడ్ - II) - 16

☛ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్ - 150

☛ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ - 18

APPSC OFFICIAL WEBSITE

Also Check Latest Notifications: Click Here

#appsc-group-1-posts #appsc-group-1-group-2-posts #appsc-group-1-2-notification #appsc-group-2-jobs-list #appsc-group-1-and-group-2-posts #appsc-group-1-vacancy #appsc-group-2-vacancy #appsc-group-2-posts
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe