వివేకా హత్యకేసులో నాస్టేట్ మెంట్ మార్చేశారు..మాజీ ఐఏఎస్ అజయ్ కల్లాం.! మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వ్యవహరించిన తీరుపై మాజీ ఐఏఎస్ అజయ్ కల్లాం హైకోర్టును ఆశ్రయించారు. తన వాగ్మూలానికి ఏ మాత్రం పొంతన లేని సమాచారాన్ని సీబీఐ ఛార్జ్ షీట్ తయారు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలపై లోతైన విచారణ జరగాలనే ఉద్దేశంతో హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశానని పేర్కొన్నారు.వివేకా హత్య కేసు వ్యవహారంలో సీబీఐ ఎస్పీ తనను కలిసి వివరాలు తీసుకున్నారని అజయ్ కల్లాం గతంలో చెప్పారు. చిట్ చాట్ అని చెప్పి సీబీఐ తన నుంచి కొన్ని వివరాలు తీసుకుందని.. తాను చెప్పిన వివరాలతో సీబీఐ రూపొందించిన 161 స్టేట్ మెంట్‌కు ఎలాంటి విలువ లేదన్నారు.కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందన్నారు. జగన్ సతీమణి ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని..తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అబద్ధాలే ఉన్నాయన్నారు. By V. Sai Krishna 29 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వ్యవహరించిన తీరుపై మాజీ ఐఏఎస్ అజయ్ కల్లాం హైకోర్టును ఆశ్రయించారు. తన వాగ్మూలానికి ఏ మాత్రం పొంతన లేని సమాచారాన్ని సీబీఐ ఛార్జ్ షీట్ తయారు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలపై లోతైన విచారణ జరగాలనే ఉద్దేశంతో హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశానని పేర్కొన్నారు. నిజాయితీతో తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతం సీబీఐ మార్చేసిందని వాపోయారు. ఈ లెక్కన విచారణ ఏ స్థాయిలో పక్కదారి పడుతోందో అర్థం చేసుకోవచ్చని అజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ తీరు ఎవరి అండతో మారింది..? దీని వెనుక ఎవరి ప్రయత్నాలున్నాయి ?.. సీబీఐ లాంటి సంస్థ వివేకా హత్య కేసును ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తోంది..? అని ప్రశ్నించారు. అజయ్ కల్లాం మార్చి 15, 2019న జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ..వైఎస్ జగన్ నివాసంలో సుమారు ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైందన్నారు. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారని..ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారన్నారు. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారన్నారు. ఇంతకుమించి తానేమీ సీబీఐకి చెప్పలేదన్నారు. స్టేట్‌మెంట్లో తాను ఇదే చెప్పానని..కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందన్నారు. జగన్ సతీమణి ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని..తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అబద్ధాలే ఉన్నాయన్నారు. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తుందని.. కొంతమంది వ్యక్తులను ఇరికించే ప్రయత్నాల్లో భాగంగానే సీబీఐ ఇది చేస్తోందన్నారు.తన పిటిషన్ ను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్‌మెంట్‌గా పేర్కొన్న అంశాలను కొట్టిపారేయాలని హైకోర్టుకు విన్నవించారు. ఈ రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అజయ్ కల్లాం వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న సంగతి తెలిసిందే. 2023 ఏప్రిల్ 9న సీబీఐ తన స్టేటమ్‌మెంట్ రికార్డు చేసిందని అజయ్ అంటున్నారు. వివేకా హత్య కేసు వ్యవహారంలో సీబీఐ ఎస్పీ తనను కలిసి వివరాలు తీసుకున్నారని అజయ్ కల్లాం గతంలో చెప్పారు. చిట్ చాట్ అని చెప్పి సీబీఐ తన నుంచి కొన్ని వివరాలు తీసుకుందని.. తాను చెప్పిన వివరాలతో సీబీఐ రూపొందించిన 161 స్టేట్ మెంట్‌కు ఎలాంటి విలువ లేదన్నారు..అది కేవలం సమాచారంగా మాత్రమే సీబీఐ సేకరించిందని చెప్పారు. తాము 2019 మార్చి 15న మేనిఫెస్టో సమావేశంలో ఉండగా వివేకా ‘నోమోర్’ అన్న విషయం మాత్రమే తనకు తెలిసిందన్నారు. వివేకా ఎలా చనిపోయారన్న వివరాలను తానేమీ సీబీఐకి చెప్పలేదన్నారు. తాను ఆ వివరాలు ఏమీ చెప్పకపోయినా సీబీఐ చేసేది ఏమీ లేదన్నారు. సీబీఐ చార్జ్‌షీటులో తాను చెప్పిన విషయాలను మార్చేసినట్లు అజయ్ కల్లాం ఆరోపిస్తున్నారు. #cbi-change-my-statement మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి