AP Assembly: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు కోసాగానున్నాయి. ఈరోజు ప్రశ్నోత్తరాలు, కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులు పెట్టనుంది ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు మంత్రులు.
జగన్ డుమ్మా..
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఈరోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టనున్నారు. నిన్న అసెంబ్లీ సమావేశాలను బైకాట్ చేసింది వైసీపీ. కాగా ఈరోజు జగన్ ఢిల్లీకి వెళ్లారు. మూడు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు జగన్ ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రధానమంత్రి,హోంమత్రి, రాష్ట్రపతిని కలవనున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులను కలిసేందుకు జగన్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి ప్రత్యేక విమానంలో జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెళ్లనున్నారు. ఇప్పటికే గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు జగన్.
Also Read : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శన టికెట్లు విడుదల