AP Elections 2024: పిఠాపురంలో భారీగా పోలింగ్.. 

ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముమ్మరంగా జరుగుతోంది. కీలక నియోజకవర్గం పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. అక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీత కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

New Update
AP Elections 2024: పిఠాపురంలో భారీగా పోలింగ్.. 

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు పోలింగ్ జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓట్లు వేయడానికి బారులు తీరారు. ఏపీలో కీలక నియోజకవర్గాల్లో ఒకటి అయినా పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. పిఠాపురం రూరల్ లో పోలింగ్ బూత్ ల వద్ద జనం భారీగా క్యూలలో ఉన్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటె, అక్కడ వైసీపీ అభ్యర్థిని వంగా గీత తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. పిఠాపురంలో RRBHR స్కూల్ 144 బూత్‌లో ఆమె ఓటు వేశారు. 

మరోవైపు ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. చాలా చోట్ల వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

దెందులూరులో..
AP Elections 2024: పోలింగ్ వేళ ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బూత్ నెంబర్ 64 దగ్గర టీడీపీ, వైసీపీ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బులు పంచుతున్నారని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రంలో పసుపు రంగు కండువాతో వచ్చి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలోనే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఫైటింగ్ కు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

శ్రీకాకుళం జిల్లాలో..
AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా కిష్టప్పపేట పోలింగ్‌ బూత్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. వైసిపీ ఏజెంట్ గా వాలంటీర్ అక్కడకు రావడంతో టీడీపీ ఏజెంట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలక్షన్ ఆఫీసర్ కు తమ అభ్యంతరాన్ని తెలియచేశారు. అయితే, ఆయన వాలంటీర్ ఏజెంట్ గా ఉండవచ్చని చెప్పారు. ఈలోపు వైసీపీ నేత ధర్మాన ప్రసాద్ అక్కడి ఆర్వోకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఏజెంట్లు ఎలక్షన్ ఆఫీసర్ తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అయినా సరే.. ఆయన వాలంటీర్ ఏజెంట్ గా ఉండొచ్చని చెప్పడంతో టీడీపీ అభ్యర్థి ఈ విషయాన్ని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 

కడప జిల్లాలో..
AP Elections 2024: కడప జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. మాజీఎమ్మెల్యే వీరశివారెడ్డి స్వగ్రామం కోగటంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఇంటి ముందు వాహనం నిలిపారని.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కోగటంలో పోలీసు బలగాలు మోహరించాయి. పోలింగ్‌ వేళ టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆందోళనలో ప్రజలు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు