AP EAPCET 2024: ఏపీ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!

ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్-2024 (AP EAPCET 2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 12 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.

New Update
AP EAPCET 2024: ఏపీ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!

AP EAPCET 2024 Notification: ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్-2024 (AP EAPCET 2024) నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఈ నెల 12 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 13 నుంచి 19వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
publive-image

ఎలా అప్లై చేయాలంటే
- https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
- అనంతరం స్టెప్ 1 పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
- తర్వాత స్టెప్ 2పై క్లిక్ చేసి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి.
- స్టెప్ 3 పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
ఇది కూడా చదవండి: APPSC Group-1 : గ్రూప్-1 పరీక్ష రద్దు.. జగన్ సర్కార్ కీలక ప్రకటన

- స్టెప్ 4 పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ స్టేటస్ చెక్ చేసుకోవాలి.
- సంతృప్తి చెందితే స్టెప్-5పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ ను భద్రపరుచుకోవాలి.

Advertisment
తాజా కథనాలు