/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/deputy-cm-jpg.webp)
AP Deputy CM Narayana: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కంటతడి పెట్టుకున్నారు. నెల్లూరులో వైయస్సార్ చేయూత 4వ విడత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. గంగాధర నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తన కూతురు కృపాలక్ష్మితో కలిసి డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి నారాయణ స్వామి భావోద్వేగాన్ని చూసి కూతురు కృపాలక్ష్మి సైతం ఎమోషనల్ అయ్యారు. తమ నియోజకవర్గంలో తమకు తెలియకుండా ఎవరితోనూ మాట్లాడొద్దని అగ్రకులాలకు చెందిన కొందరు వైసీపీ నేతల మాటలు తమకు చాలా బాధ కలిగించాయని కంటతడి పెట్టుకున్నారు. చేసే పనిలో నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడకుండా, తలవంచకుండా, నడుచుకోవాలని కూతురుకు డిప్యూటీ సీఎం నారాయణ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
Also Read: కాశీ విశ్వనాథుని ఈ 6 రహస్యాలు వింటే మీరు మైమరచిపోవడం ఖాయం..!
అల్లారు ముద్దుగా పెరిగిన కూతురుకు ఇలాంటి మాటలు చాలా బాధ కలిగిస్తాయని నారాయణస్వామి వాపోయారు. పార్టీలో కొందరు నాయకులు తమ మాటే గెలవాలని, వినాలని ఆదేశాలు జారీ చేయడం బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా వచ్చామే తప్ప దాచుకోవాని, దోచుకోవాలని రాలేదని కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరూ తమకు సమానమేనని నారాయణస్వామి స్పష్టం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి ఆశీస్సులతోనే కృపాలక్ష్మికి టికెట్ వచ్చిందని, వారికి జీవితాంతం రుణపడి ఉంటామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. 10 ఏళ్లు ఆదరించిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజలు కూతురు కృపాలక్ష్మిని కూడా ఆదరించాలని ఆకాంక్షించారు.