Jagan delhi tour postponed: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. నిజానికి ఇవాళ(సెప్టెంబర్ 13) సాయంత్రం ఆయన ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. దీంతో జగన్ తన టూర్ వాయిదా వేసుకున్నారని రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం(సెప్టెంబర్ 14) మధ్యప్రదేశ్ పర్యటనకు వెళుతున్నారు. ఆయన అపాయింట్మెంట్ కూడా ఖరారు కాలేదని సమాచారం.
చంద్రబాబుపై చర్చించేందుకే..!
ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు దారి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత పరిణామాలను కేంద్రానికి వివరించేందుకు జగన్ ఢిల్లీకి రావాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరిగింది. కేంద్రానికి దగ్గరగా జగన్ మూవ్ అవుతున్నారని.. ఇప్పటికే పార్లమెంట్ బిల్లుల విషయంలో వైసీపీ ఎంపీలు ఎన్డీఏకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అటు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం.. ఈ కేసులో సీఐడీతో పాటు ఈడీ కూడా దూకుడు మీద ఉండడంతో టీడీపీ నేతలను కలవరపెడుతోంది.
జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలోనే చంద్రబాబునాయుడు అరెస్ట్ అయ్యారు. లండన్ పర్యటన ముగించుకోని ఇటివలే రాష్ట్రానికి వచ్చిన జగన్ రెండు రోజుల క్రితం డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా కీలక అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవం కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ సీఎం జగన్‌కు ఆహ్వానం పంపడంతో పాటు టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతోనూ సమావేశమయ్యారు.
అసెంబ్లీ సమావేశాలకు వేళాయే:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి జరగనున్నాయి. మొత్తం ఆరు రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో జగన్ సర్కార్ తర్వాతి స్టెప్ ఏంటన్నది ఆసక్తిగా మారింది.
ALSO READ: వ్యూహామా.. తప్పిదమా..? బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్!