New Sand Policy: ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో టీడీపీ హయాంలోని ఇసుక పాలసీకి.. జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి తేడాను అధికారులు వివరించారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల నష్టం జరిగిందని చంద్రబాబుకు అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభానికి గురైందని అధికారులు పేర్కొన్నారు.
ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో చాలా ఇబ్బందులు వచ్చాయని సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ధరల తగ్గింపుపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. తక్షణం నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడాలన్నారు. రోడ్ల మరమ్మత్తులపై ఫోకస్ పెట్టాలన్నారు.
జనం ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలే కాదు.. దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని అధికారులకు జగన్ సూచించారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలని అధికారులకు సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉచిత ఇసుక విధానం తెస్తామని, ధరలను తగ్గిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు కొత్త ఇసుక పాలసీపై ఏపీ సీఎం అధికారులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.