New Sand Policy: ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో టీడీపీ హయాంలోని ఇసుక పాలసీకి.. జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి తేడాను అధికారులు వివరించారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల నష్టం జరిగిందని చంద్రబాబుకు అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభానికి గురైందని అధికారులు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..AP CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు.. ఏపీలో కొత్త ఇసుక పాలసీ?
ఏపీలో నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను తక్షణమే అందుబాటులోకి తేవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో కొత్త ఇసుక పాలసీపై ఆయన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.
Translate this News: