Nara Lokesh: నారా లోకేష్ సీఐడీ విచారణకు లంచ్ బ్రేక్.. మూడు గంటల పాటు అడిగిన ప్రశ్నలివే!

ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నారా లోకేష్ ను ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంపై విచారించింది ఏపీ సీఐడీ. ప్రస్తుతం ఆయనకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగనుంది.

New Update
Nara Lokesh: నారా లోకేష్ సీఐడీ విచారణకు లంచ్ బ్రేక్.. మూడు గంటల పాటు అడిగిన ప్రశ్నలివే!

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో (IRR Case) విచారణకు హాజరైన నారా లోకేష్ కు (Nara Lokesh) సీఐడీ లంచ్ బ్రేక్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. ఈ మూడు గంటల పాటు పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ ల ఆధారంగా లోకేష్ పై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించింది సీఐడీ. దీంతో పాటు.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసు?, మూడుసార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా? హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు?, హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసింది? అంటూ లోకేష్ పై సీఐడీ ప్రశ్నలు వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:Chandrababu Inner Ring Road Case :ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్

ఇంకా 2014 జులై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా? అంటూ కూడా ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో పాటు లింగమనేని రమేష్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి? అంటూ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పరిసరాల్లోనే భూములు ఎందుకు కొన్నారంటూ సీఐడీ లోకేష్ ను అడిగినట్లు సమాచారం. ఇంకా.. చంద్రబాబు నుంచి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు తెలిసిందా? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. ఇలా మొత్తం లోకేష్ ను సీఐడీ దాదాపు 16 అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అయితే.. తానేం తప్పు చేయలేదని అనేక ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్రశ్నలకు తెలియదు అని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు జరిగిన విచారణలో లోకేష్ చెప్పిన సమాధానాల ఆధారంగా లంచ్ బ్రేక్ తర్వాత కొత్త ప్రశ్నలను అడగడానికి సిద్ధమవుతున్నారు ఏపీ సీఐడీ అధికారులు.

Advertisment
తాజా కథనాలు