AP Sand Policy: ఏపీలో ఆ విధానం రద్దు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

నూతన ఇసుక పాలసీ విషయమై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. 2019, 2021 ఇసుక పాలసీలను రద్దు చేసింది. కొత్త ఇసుక పాలసీని రూపొందించే వరకు పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు!
New Update

CM Chandrababu: ఏపీలోని చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2019, 2021లో అప్పటి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఇసుక విధానాలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఇసుక విధానం రూపకల్పన చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అప్పటి వరకు కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. 2019, 2021 ఏడాదిల్లో గత ప్రభుత్వం ఇచ్చిన రెండు ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత ఇసుక సరఫరాపై (AP Free Sand Policy) విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాల జారీ చేసింది.

రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని తాజా జీవోలో పేర్కొన్నారు. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచనలు చేసింది ప్రభుత్వం.

49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లల్లో అందుబాటులో ఉందని ప్రభుత్వం తెలిపింది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్ ప్రక్రియకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. డి-సిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇసుక లోడింగ్, రవాణ ఛార్జీలను నిర్దారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగించనున్నారు.

స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణ ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ఇసుకను తిరిగి విక్రయించినా.. ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణం మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణ చేపడితే పెనాల్టీలను సైతం నిర్ధారించారు.

Also Read: నందికొట్కూరు టీడీపీలో గ్రూప్ వార్.. అగ్గిరాజేసిన బైరెడ్డి!

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe